విజయవాడ ముచ్చట్లు:
అక్రమంగా గత మూడు రోజులుగా గోవుల రవాణా చేస్తున్న వాహనాలు పట్టుకున్న గోరక్షకులపై కృష్ణలంక పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. కృష్ణలంక సర్కిల్ ఇన్స్ పెక్టర్ దుర్గారావు గోసంరక్షకులపై అసభ్య పదజాలం ఉపయోగించారని బాధితులు ఆరోపించారు. అదేమని ప్రశ్నించిన వారిని లారీ తొక్కితే ఏమి చేస్తావు అంటూ ప్రశ్నించారు.
ఎక్కువ మాట్లాడితే బొక్కలో వేసి వుతుకుతానంటు బెదిరించారు. దాంతో రాష్ట్ర గోసంరక్షణ అధ్యక్షుడు సురేష్ కుమార్ విస్తూపోయి సిఐతో వాగ్వానికి దిగారు. కలెక్టర్, పోలీసు వున్న తాధి కారులకు ఫిర్యాదు చేస్తామని సురేష్ కుమార్ అనడంతో సిఐ మరింత రెచ్చిపోయారు. ఎవరికి చెప్పుకుంటా వో చెప్పుకో అంటూ హేళన చేసాడు.
మానసికంగా హింసించడమే కాకుండా గోరక్షకుల్ని గోమాతని చులకన చేసినందుకు ప్రముఖ స్వామీజీ పీఠాధిపతి శివ స్వామి సోమవారం నాడు విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. సదరు సిఐపై చర్యలు తీసుకోకపోతే గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని శివస్వామి అన్నారు. న్యాయం జరక్కుంటే ఆందోళనకు పిలుపు నిస్తామని శివస్వామి.. ఆర్ ఎస్ ఎస్ నేతలు వెల్లడించారు

Tags;Possession of cows
