Natyam ad

గంజాయి స్వాధీనం..ముగ్గురు అరెస్టు

మెదక్ ముచ్చట్లు:


ఎక్సైజ్ శాఖ అధికారులు  తనిఖీ లో భాగంగా నర్సాపూర్ శివాల్లోని రుస్తుంపేట బస్ స్టాప్ వద్ద గంజాయితో వెళ్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద 510 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.ఎక్సైజ్ జిల్లా టాస్క్ ఫోర్సు సీఐ రామ్ రెడ్డి తెలిపినా వివరాలు ఇలా వున్నాయి. శుక్రవారం రోజున మెదక్ జిల్లా ఎక్సెజ్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన విలేక సమావేశంలో మాట్లాడుతూ . నర్సాపూర్ పట్టణంకు చెందిన సాయి కుమార్, పురుషోత్తం, శివ కుమార్ లు సంగారెడ్డి నుంచి పల్సర్ బైక్ పై గంజాయి తీసుకు వస్తుండగా నర్సాపూర్ శివారులోని రస్తుం పేట వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి బైక్ తనిఖీ చేశారు. వారి వద్ద 510 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైందని తెలిపారు. సంగారెడ్డి లో గుర్తు తెలియని వ్యక్తి వద్ద రూ.20 వేలు ఇచ్చి కొనుగోలు చేసినట్లు చెప్పా వారి వద్ద ఉన్న గంజాయి స్వాధీనం చేసుకొని బైక్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags:Possession of ganja..Three arrested

Post Midle
Post Midle