Possession of marijuana worth Rs

రూ.50 వేలు విలువ చేసే గంజాయి స్వాధీనం

– వ్యక్తి అరెస్ట్

Date:24/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని చిన్నకొండచెర్ల చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా ద్విచక్రవాహనంలో గంజాయి తీసుకొస్తున్న వ్యక్తి పట్టుపడిన సంఘటన గురువారం రాత్రి జరిగింది. సీఐ గంగిరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎక్సెజ్‌ సీఐ శ్రీనివాసరెడ్డి , సిబ్బందితో కలసి కర్నాటక సరిహద్దులో తనిఖీలు చేస్తుండగా పట్టణంలోని భగత్‌సింగ్‌ కాలనీకి చెందిన రవి అనే యువకుడు ఒక బాలుడిని వాహనంపై కుర్చోపెట్టుకుని వాహనంలో సుమారు 20 కిలోల గంజాయి తీసుకొస్తుండగా పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారీకావడంతో వెంబడించి పట్టుకున్నారు. అతనిని విచారించగా సుమారు రూ.50 వేలు విలువ చేసే గంజాయిని కర్నాటక నుంచి విక్రయించేందుకు పుంగనూరుకు తీసుకొస్తున్నట్లు తెలిపాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఏపీలో ఏసీబీ సునామీ…

Tags: Possession of marijuana worth Rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *