ఎర్రచందనం స్వాధీనం
పోలవరం ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పాత పైడిపాక గ్రామంలో కలపను అక్రమంగా నిల్వచేసిన ప్రదేశాల పై పోలవరం అటవీశాఖ అధికారి ఎన్ దావీద్ రాజ్ దాడులు జరిపి భారీగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎన్ దావీద్ రాజ్ మాట్లాడుతూ పాత పైడిపాక గ్రామంలో అక్రమంగా కలప నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో సిబ్బంది తో కలిసి ఆదివారం ఆ గ్రామంలో తనిఖీలు నిర్వహించి 3 లక్షల 86 వేల 479 రు,, విలువ గల 3.378 క్యూబిక్ మీటర్ల రోజ్ వుడ్ ,టేకు,వేగిస దుంగల్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ముద్దాయి కోసం దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు..పోలవరం ప్రాజెక్ట్ పనులు జరుగడం, గోదావరిపై కాపర్ డ్యాం నిర్మాణంతో అక్రమంగా కలపను తరలించే కలప స్మగ్లర్లకు పోలవరం మీదుగా,గోదావరి నదిపై నుండి దాదాపుగా కలప అక్రమ రవాణా నిలిచిపోయాయనే చెప్పొచ్చు.. అదే అదనుగా తీసుకుని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొంతమంది వ్యక్తులు అక్రమంగా కలపను తరలించేందుకు ప్రాజక్ట్ పునరావాస గ్రామం ఖాళీ అయిన పాత పైడిపాక గ్రామంను ఎంచుకుని అక్కడి నుండి తూర్పు గోదావరి జిల్లాకు కలపను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Possession of red sandalwood