పోస్టల్ సిబ్బంది నిర్వాకం
జగ్గయ్యపేట ముచ్చట్లు:
జగ్గయ్యపేట పోస్టల్ సిబ్బంది విధులలో అలసత్వం బహిరంగంగా బట్టబయలైంది. పట్టణ ప్రజలకు చేరాల్సిన ఒరిజినల్ ఆధార్ కార్డులు, పెళ్లి కార్డులు, బ్యాంకు లెటర్స్, వివిధ ప్రభుత్వ శాఖల చేరాల్సిన లేఖలు బట్వాడా చేయలేక తొర్రగుంట పాలెం ఆర్టీవో ఆఫీస్ వెనక ముళ్ళకంప లలో పడేశారు.వీటిలో లాయర్ నోటీసులు, వివిధ దేవాలయాల నుంచి వచ్చిన ప్రసాదాలు, నిరుద్యోగులు డబ్బుతో కొనుక్కునే స్టడీ మెటీరియల్, సుమారు రెండు వందల ఒరిజినల్ ఆధార్ కార్డులు, ఇలా ఎన్నో రకాల రిజిస్టర్ పోస్టులు ఉన్నాయి. రిజిస్టర్ పోస్ట్ లకు ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేసే పోస్టల్ శాఖ ప్రజల అడ్రస్ కు చేర్చకుండా ముళ్ళకంప లో పడేసిన వారిపై చర్యలు తీసుకొని. వీటన్నిటిని ప్రజలకు చేర్చాలని పలువురు కోరుతున్నారు.
Tags: Postal staff administration

