శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సాక్షాత్కార వైభవోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
తిరుపతి ముచ్చట్లు:
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాల పోస్టర్లను జెఈవోవీరబ్రహ్మం సోమవారం ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ, జూలై 3 నుండి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు వైభవంగా సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా జూలై 3, 4, 5వ తేదీలలో ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 8 నుండి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని వివరించారు.కాగా, శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారు జూలై 3న పెద్దశేష వాహనంపై, జూలై 4న హనుమంత వాహనంపై, జూలై 5న శ్రీవారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
జూలై 6న పార్వేట ఉత్సవం :
శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూలై 6న పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం చేపడతారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags: Posters of Sri Kalyana Venkateswaraswamy Sakshatkara Vaibhavotsavalam unveiled