మోత్కుపల్లి సమర శంఖరావం పోస్టర్ ఆవిష్కరణ

Postmodern poster

Postmodern poster

Date:19/09/2018
ఆలేరు ముచ్చట్లు :
ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు అందించడమే నా అంతిమ లక్ష్యమన్నారు మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఈనెల 27న “మోత్కుపల్లి శంఖారావం” పేరుతో నిర్వహించ తలపెట్టిన సభకు సంబంధించిన పోస్టర్ ను యాదగిరిగుట్టలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు మోత్కుపల్లి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ఆలేరు నియోజకవర్గ ప్రజలు, మరోసారి నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
ఆలేరు ఎమ్మెల్యేగా వరుసగా ఐదుసార్లు నన్ను గెలిపించిన ఆలేరు ప్రజల రుణం తీర్చుకోలేనిదని, అంధకారంలో ఉన్న ఆలేరు నియోజకవర్గానికి విద్యుత్ అందించానని, ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఎన్నో అభివృద్ధి పథకాలు, సంక్షేమం, రోడ్లు వేయించానన్నారు మోత్కుపల్లి. చివరి శ్వాస వరకు ఆలేరు ప్రజల కోసం బ్రతుకుతానన్న మోత్కుపల్లి, ఆలేరు ప్రజలకు గోదావరి జలాలు అందించడమే నా ముందున్న ఏకైక లక్ష్యమన్నారు .
Tags:Postmodern poster

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *