9 బాడీలకు పోస్టుమార్టం

Date:23/05/2020

వరంగల్ ముచ్చట్లు:

గొర్రెకుంట బావిలో నుంచి వెలికి తీసిన 9 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. వీరంతా బతికి ఉండగానే నీళ్లలో పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో బయపటడిన 9 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు తీవ్ర కలకలం రేపడంతో.. అందరూ పోస్టుమార్టం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా వాళ్లంతా బతికి ఉండగానే బావిలో పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. వాళ్లంతట వాళ్లే నీళ్లలోకి దూకారా? లేదంటే విషం, మత్తులాంటిది ఇచ్చి బతికి ఉండగానే బావిలోకి తోసేశారా అనేది తెలియాల్సి ఉంది.ఈ కేసులో ఫోన్ కాల్స్ కీలకం కానున్నాయి. మక్సూద్ కూతురు బుస్రాతో సన్నిహితంగా మెలుగుతున్న యాకూబ్ ఫోన్ కాల్స్‌తోపాటు.. ఇతరులతో మక్సూద్ ఏం మాట్లాడారనేది కీలకం కానుంది. మృతుల్లో ఏడుగురి సెల్ ఫోన్లు లభ్యం కాకపోవడంతో.. వారి ఫోన్ల కోసం పోలీసుల గాలిస్తున్నారు.ఈ కేసులో పోలీసులు ఇప్పటికే యాకూబ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతడితోపాటు బిహర్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

సచివాలయ నిర్మాణానికి స్థల పరిశీలన

Tags: Postmortem for 9 bodies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *