చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టెం

విశాఖపట్నంముచ్చట్లు:

విశాఖ మధురవాడలో కలకలం రేపిన చిన్నారి హత్య కేసును పోలీసులు విచారణ చేపట్టారు. మధురవాడలోని ఐదోవార్డు మారికవలస గ్రామంలో మూడేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై దర్యాప్తులో భాగంగా బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. మారికవలస గ్రామానికి చెందిన లారీ క్లీనర్ రమేశ్కు అదే గ్రామానికి చెందిన వరలక్ష్మితో 2016లో వివాహమైంది. అప్పటి నుంచి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వరలక్ష్మికి అక్రమ సంబంధం ఉందని రమేశ్ అనుమానిస్తూ వచ్చాడు.ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. కాగా, మూడు నెలల క్రితం పాపతో సహా వరలక్ష్మి వేరే వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా బుధవారం వరలక్ష్మి రమేశ్కు ఫోన్చేసి పాప చనిపోయింద ని తెలిపింది. దీంతో ఆవేదన చెందిన రమేశ్.. కుటుంబ సభ్యులతో కలిసి భార్య వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే అంత్యక్రియలు పూర్తి చేశారు. పాప మృతిపై అనుమానం వ్యక్తం చేసిన రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని  బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు.దీనిపై దర్యాప్తు జరుపుతోంది పీఎం పాలెం సిఐ రవి కుమార్ తెలిపారు.

మహేష్‌బాబు భావోద్వేగం

 

Tags:Postmortem for infant corpse

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *