ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా పేదరికం పోవడం లేదు            

Poverty does not make any decision on how many decisions are made

Poverty does not make any decision on how many decisions are made

Date:19/09/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
దేశంలో మేధాశక్తి సంపద కి కొదవలేదు. మేధావులు ఎన్నో సూచనలు చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, సియంలు, మేము అందరం బీదరికం గురించి మాట్లాడుతున్నాం.. దాన్ని అంతమొందించాలని ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఫలితం లేదు.సంపద ఎంత సృష్టించబ డ్డా పేదరికం తగ్గడం లేదని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేసారు.గొప్ప రాజ్యాంగం రాసుకొని అమలుచేస్తున్న ప్రజాస్వామిక దేశం కాని రాసుకున్ వి అమలుకావడం లేదని,.మానవ సంపద డబ్బు కంటే గొప్పదన్నారు.నా దేశం రిచేస్ట్ కంట్రీ కాబోతుంది.. 40 శాతం యువశక్తి కల దేశం అని చెప్పుకుంటున్నాం.
కానీ ఆ యువశక్తి క్వాలిటీ కల్లది కాకపోతే, ఆరోగ్యవంతమైనది కాకపోతే ఆ దేశం సంపన్నమైనది కాలేదన్నారు.70 ఏళ్ల భారతంలో ఆశించిన ఫలితం రాలేదు అనేది వాస్తవమన్నారు.తెలంగాణ రాష్ట్రం లో .. రెండు పనులు చేస్తునం.వెంటనే ప్రజలకి అందించేవి. శాశ్వతంగా ప్రయోజనాలు చేకూర్చే కార్యక్రమాలు. వీటితో తెలంగాణ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రం గా తీర్చిదిద్దుతామని నమ్మకం ఉంది.
ఇన్ని సంవత్సరాల రుగ్మతలను ఒక్క సంవత్సరంలోనే మేము రూపు మాపగలమని చెప్పడం లేదు.. కానీ ఈ రుగ్మతలను తుడిచివేయగల మన్నారు. బడ్జెట్ అంటే కేవలం లెక్కలే కాదు. ప్రజల జీవం అవిస్కరిస్తున్న బడ్జెట్ మాది.తెలంగాణ ప్రజల సొమ్మును వృధా పోనివ్వమన్నారు.కేంద్రం మహిళ శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్ ను 18000 కొట్లనుండి 10000 కోట్లకు తగ్గించినా.. మన సీఎం గారి మాత్రం ఏమాత్రం తగ్గించవద్దని చెప్పారు.
మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు పుడితే నే ఆరోగ్య తెలంగాణ ఉంటుందినని సీఎం అన్నారు. సెస్ చేసిన ఈ స్టడీ లో 2000 వేల మంది పిల్లలను 16 సంవత్సరాల పాటు ప్రతి 3 సంవత్సరాలకి ఒక సారి వారి దగ్గరికి వెళ్ళి స్టడీ చేశారు. వారి చదువు, ఎదుగుదల సాగిన ఈ సర్వే అనేకవస్తవాలను బయటికి తీసుకువచ్చింది. ఈ వివరాలను పాలసీ లు తయారు చేయడంలో ఉపయోగిస్తాం. కానీ పేద పిల్లల బ్రతుకులో   అప్పటికి ఇప్పటికి పెద్ద మార్పు లేకపోవడం బాధాకరమన్నారు.
ఒకప్పుడు అందరూ ఓకే స్కూల్ లో చదువుకొనే వారు. కానీ ఇప్పుడు డబ్బున్న వాడి స్కూల్స్ వేరు అయ్యాయి.. పేదవాడి స్కూల్స్ వేరు అయ్యాయి. గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకొనే వారు మాకు గొప్ప చదువులు చదివే అవకాశం లేదు అనే ఆత్మన్యూనత భావన లోకి వెళ్లిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కేజీటు పీజీ తీసుకువచ్చి ఈ భేదాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుందన్నారు.సంపద ఎవరబ్బ సొమ్ముకాదు. సంపద ప్రజలందరిని,సంపద ఒక్కరి దగ్గరికి చేరడం పేదరికం కి కారణమన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత మొరపెట్టుకున్నా విద్యార్థులకు హాస్టల్ మెస్ చార్జీలు పెంచలేదు.
కానీ ఆకలి బాధ తెలిసిన మేము రాగానే ఎవరు అడగుండానే సరిపోయేంత బువ్వ పెడుతున్నామన్నారు.ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా ను ఖర్చు లా చూడకూడదు. మంచి నీటిని అందించడం ఖర్చు కాదు ప్రాణం నిలబెట్టే అంశంగా చూస్తామన్నారు.రైతు చేసేది వ్యాపారం కాదు.. దేశానికి అన్నం పెట్టేవాడు. అలాంటి రైతుకి డబ్బులు ఇవ్వడం అంటే సాయం చేయడమేనన్నారు.
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం మా ప్రభుత్వ లక్షం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసినప్పుడే అది సాధ్యం అని భావిస్తున్నామని,ఇలాంటి స్టడీ లు సమాజంలో మార్పు తీసుకువస్తుంది అని భావించే వ్యక్తిని నేను. ఇలాంటివి అవసరం. ఈ సారాంశాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తామన్నారు.అనేక పథకాలు తీసుకువచ్చి, ఉచితంగా అందించడం వల్ల రాష్ట్రం దివాలా తీస్తుంది అని చాలామంది అంటున్నారు.
Tags:Poverty does not make any decision on how many decisions are made

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *