విద్యకు పేదరికం అడ్డు కాకూడదు

పేదలకు మెరుగైన విద్యను
అందించడమే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా

కడప ముచ్చట్లు:


విద్యకు పేదరికం ఏ మాత్రం అడ్డు కాకూడదనేదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. సోమవారం కడప కలెక్టరేట్ సభాభవన్ లో “జగనన్న అమ్మఒడి” పథకం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఉపముఖ్య మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజుతో పాటు.. ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, డా. దాసరి సుధా, రవీంద్రనాథ్ రెడ్డి, జేసీ సాయికాంత్ వర్మ, రాష్ట్ర పరిశ్రమల శాఖ అభివృద్ధి సలహాదారు రాజోలు వీరారెడ్డి, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, రాష్ట్ర సగర కార్పొరేషన్ చైర్ పర్సన్ జి.రమణమ్మ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.శ్రీకాకుళం బహిరంగ సభ నుండి.. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ముగిసిన అనంతరం జిల్లాలో “అమ్మఒడి” లబ్దిదారులయిన 1,87,742 మంది విద్యార్థుల తల్లులకు మంజూరైన మూడవ ఏడాది లబ్ది మొత్తం రూ.281,61,30,000 ల మెగా చెక్కును ఉపముఖ్యమంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా ఉపముఖ్య మంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. “ఒక కుటుంబం, ఒక సమాజం.. ఏదైనా సరే వారి తలరాతను మార్చగలిగే శక్తి.. ఒక్క చదువుకు మాత్రమే ఉందని” నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..

 

 

 

మూడేళ్ళ క్రితం రాష్ట్రంలో విద్యారంగంలో వినూత్నమైన మార్పులను తీసుకువచ్చారన్నారు. మన పిల్లలు బాగుండాలి” అన్న ఒక్క ప్రధాన ఉద్దేశ్యంతోనే.. “జగనన్న అమ్మఒడి” పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదన్నారు. . మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్క చిన్నారి కూడా బడికి దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఈ పథకానికి రూపకల్పన చేశారన్నారు. వరుసగా మూడవ ఏడాది “అమ్మ ఒడి” లబ్ది మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తుండగా.. వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా.. ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్నినిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ.. విద్యాదానం అనంతమైనదని,  దానం చేస్తున్నకొద్దీ.. విజ్ఞానం పెరుగుతుందని తెలిపారు. ప్రతి తల్లీ పాఠశాలల్లో పేరెంట్ మీటింగ్ కు తప్పక హాజరయ్యి.. పిల్లల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తల్లులకు సూచించారు. సంక్షేమ పథకాలను అమలు చేయడం వరకే ప్రభుత్వ బాధ్యత.. ఆ పథకాల ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రధాన బాధ్యత ప్రభుత్వ అధికారులదే అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం “నాడు-నేడు”

 

 

 

కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలలో 10 రకాలయిన మౌలిక వసతులు కల్పిస్తూ.. విద్యార్థుల చదువు కోసం మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో.. పిల్లల విద్యాభివృధ్ధి కోసం ప్రతి తల్లీ భాగస్వామ్యం కావాల్సి ఉందన్నారు. ప్రతిరోజూ పిల్లల చదువు పర్యవేక్షణ కోసం కొంత సమయం కేటాయించాలని సూచించారు.ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న అమ్మఒడి పథకం ద్వారా పేద కుటుంబంలోని ప్రతి చిన్నారికి విద్య అందుతుందని, తద్వారా ఆయా కుటుంబాలు విద్యతోపాటు, ఆర్ధికంగా వృద్ది చెందుతారన్నారు. అంతేకాకుండా పాఠశాలల్లో డ్రాప్ ఔట్స్ శాతం కూడా పూర్తిగా తగ్గుతుందనేదే.. ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. అమ్మఒడితో పాటు… అన్ని స్థాయిల విద్యార్థులకు అన్ని రకాలుగా.. ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందన్నారు.  ఎమ్మెల్యేలు డా.సుధా, రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి లు మాట్లాడుతూ.. విద్యకు అత్యంత  ప్రాధాన్యతను ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్.జగన్ మోహన్ రెడ్డి.. ఈ మూడేళ్ళలో ఆదర్శ ముఖ్యమంత్రి గా మాత్రమే కాకుండా.. గొప్ప విద్యావేత్తగా గుర్తింపు పొందారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ప్రయివేట్‌ జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం గత ఏడాది నుండే ప్రభుత్వం వర్తింపజేసిందన్నారు. 2021-22 విద్య సంవత్సరంలో.. అమ్మఒడి అర్హతలు కూడా కొంత వెసులుబాటును కల్పిస్తూ.. 75% హాజరు ఉండాలన్న నిబంధనను కొన్ని విఫత్తుల నేపత్యంలో కొంత సడలింపు చేసి అర్హులందరికీ లబ్ది చేకూరుస్తున్నారన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటు పాఠశాలలకు ధీటుగా అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. విద్యారంగంలో సమున్నత మార్పులను తీసుకువచ్చిందన్నారు.

 

 

 

రాష్ట్ర పరిశ్రమల శాఖ అభివృద్ధి సలహాదారు రాజోలు వీరారెడ్డి, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, రాష్ట్ర సగర కార్పొరేషన్ చైర్ పర్సన్ జి.రమణమ్మ లు మాట్లాడుతూ.. ఒక తరాన్ని బాగు చేయాలంటే.. ఒక కుటుంబంలో అందరూ విద్యావంతులయితేనే..  సాధ్యం అవుతుందని.. నమ్మిన ముఖ్యమంత్రి మన ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. నాలెడ్జిని పెట్టుబడి పెట్టడం ద్వారా.. రాష్ట్రం మరింత ఉన్నత విద్యా వ్యాప్తితో పాటు.. నాణ్యమైన, అత్యుత్తమ ప్రమాణాలతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుతాయనే ఉద్దేశ్యంతో.. విద్యా రంగానికి పెద్దపీటవేశారన్నారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదనే ఆలోచనతో ప్రతి ఏటా రూ.15 వేల మొత్తాన్ని విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకుల బ్యాంక్‌ ఖాతాల్లో అమ్మఒడి ఆర్థిక సాయం మొత్తం జమ చేయడం జరుగుతోందన్నారు. అంతేకాకుండా… వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ ప్రై ప్రైమరీ పాఠశాలలు, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్య, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వంటి విద్య ఉన్నతిని పెంచే కార్యక్రమాలతో పాటు.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10 రకాలయిన మౌలిక వసతులను కల్పిస్తోందన్నారు. విద్యార్థులకు ఎలాంటి దృష్టి లోపం లేకుండా కంటి చూపును అందించే దిశగా అన్ని పాఠశాలల విద్యార్థులకు “వైఎస్ఆర్ కంటి వెలుగు” అనే పథకం ద్వారా ఉచిత కంటి పరీక్షలు, కళ్ళ అద్దాలు, అవసరమైన వారికి చికిత్సలు చేయించడం జరిగిందన్నారు.
అలాగే జగనన్న విద్య దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాలతో పాటు ప్రతి ప్రైమరీ పాఠశాలలో ఇంగ్లీషు ల్యాబులను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి ఆరోగ్యన్నందించేందుకు మధ్యాహ్న భోజనం పథకంలో నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 3 జతల యూనిఫామ్ దుస్తులు, బ్యాగు, బెల్టు, షూ, పుస్తకాలు ఇస్తున్నామన్నారు.

 

 

మంచి ప్రమాణాలతో విద్యార్థులను చదివించండి. రూ.కోట్ల విలువైన విజ్ఞానాన్ని మీ పిల్లలకు అందించండి అని సూచించారు. అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీష్ లో ప్రతి ఒక్కరూ ప్రావీణ్యం పెంచుకునేందుకు.. మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని అమలు చేస్తోందన్నారు. 8వ తరగతిలోకి వచ్చిన ప్రతి విద్యార్థికి సాంకేతిక కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించేందుకు ల్యాప్ టాప్ లు ఈ సెప్టెంబర్ మాసంలో అందివ్వనున్నట్లు తెలిపారు. సమాజ్ అన్ని తరగతులకు అధునాతన బోధనా విధానాలతో.. బైజూస్ యాప్ ద్వారా విద్యాబోధన అందివ్వడం జరుగుతోందన్నారు. భారతదేశములో ఎక్కడా లేనటువంటి సంక్షేమ విధానాలను అమలుచేస్తూ.. రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, తల్లులు  చేసిన ప్రసంగాలు పలువురికి స్ఫూర్తినిచ్చాయి.  బృహత్తరమైన అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన మన ముఖ్యమంత్రికి రాష్ట్రం యావత్తు ఉన్న తల్లులు రుణపడి ఉన్నామని, ఈ పథకం ద్వారా కేవలం లబ్ది పొందడమే కాదు. తల్లులుగా పిల్లలను పర్యవేక్షించాల్సిన బాధ్యత మాపై ఉందనే బాధ్యతను ప్రభుత్వం గుర్తు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య ఆర్జేడీ వెంకట కృష్ణ, ఎస్.ఎస్.ఏ. పివో డా. ఎ. ప్రభాకర్ రెడ్డి, డిఇఓ దేవరాజు, ఇంటర్మీడియెట్ విద్య ఆర్.ఐ.ఓ. ఎస్.వి. రామణరాజు, డివిఈవో జి. శ్రీనివాసులురెడ్డి, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Poverty should not be an obstacle to education

Leave A Reply

Your email address will not be published.