13 రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం

న్యూఢిల్లీ ముచ్చట్లు:


13 రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుంది. రాష్ట్రాలన్నీ భారీ బకాయిలు పడ్డాయని, చెల్లించకపోతే విద్యుత్ సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈమేరకు ప్రభుత్వ యాజమాన్యంలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్  13 రాష్ట్రాల్లోని 27 పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పవర్ ట్రేడింగ్‌ను నిషేధించాలని మూడు పవర్ ఎక్స్ఛేంజీలు అయిన ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్, పవర్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ పవర్ ఎక్స్ఛేంజ్‌లను కోరింది.ఈ పంపిణీ సంస్థలకు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి భారీ బకాయిలు ఉన్నాయి. లిస్టులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి.విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పోసోకో దేశంలో విద్యుత్ వ్యవస్థ సమగ్ర కార్యాచరణను నిర్వహిస్తుంది. ఈ మేరకు మూడు పవర్ మార్కెట్‌లకు రాసిన లేఖలో, “13 రాష్ట్రాల్లోని 27 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అన్ని విద్యుత్ మార్కెట్ ఉత్పత్తులను కొనడం-అమ్మడం/డెలివరీ చేయడం 2022 ఆగస్టు 19 నుంచి తదుపరి నోటీసు వచ్చే వరకు ఖచ్చితంగా నిషేధించాలి” అని పేర్కొంది.చెల్లింపు భద్రతా వ్యవస్థ కింద, ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థలను ఉత్పత్తి చేసే కంపెనీలకు బకాయిలు చెల్లించనందుకు విద్యుత్ మార్కెట్‌లో వ్యాపారం చేయకుండా నిషేధించవచ్చు. దీని కింద, తగినంత చెల్లింపులు చేస్తే లేదా ముందస్తు చెల్లింపు చేస్తేనే విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలుస్తుంది. లేదంటే మాత్రం ఈ రాష్ట్రాల్లో చీకట్లు కమ్ముకోనున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ రూ. 1380 కోట్లు, తమిళనాడు రూ. 924 కోట్లు రాజస్థాన్ రూ. 500 కోట్లు, జమ్మూ కాశ్మీర్ రూ. 434 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 412 కోట్లు, మహారాష్ట్ర రూ. 381 కోట్లు, చత్తీస్ఘడ్ రూ. 274కోట్లు, మధ్యప్రదేశ్ రూ. 230 కోట్లు, ఝార్ఖండ్ రూ. 214 కోట్లు, బీహార్ రూ. 172 కోట్లుగా తేలింది. అయితే, తెలంగాణను ఇబ్బంది పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుందంటూ తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆరోపణలు కురిపిస్తున్నాయి. తెలంగాణ విద్యుత్ బకాయిల విషయం హైకోర్టులో ఉందంటూ చెప్పుకొచ్చాయి.

 

Tags: Power crisis in 13 states

Leave A Reply

Your email address will not be published.