Natyam ad

 సిక్స్ తో అధికారం ఫిక్సా

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణలో ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నా..ప్రధానంగా కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా – నేనా అన్నట్లగా వార్ కనిపిస్తోంది. హ్యాట్రిక్ కోసం కేసీఆర్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నేరుగా అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఏ ఒక్క అవకాశం మిస్ చేసుకోకూడదని భావిస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ సారి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. మరి..క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి.  తెలంగాణలో ఎన్నికల సమరం ఆసక్తి కరంగా మారుతోంది. సర్వేలు సైతం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని సర్వేలు బీఆర్ఎస్ కు హ్యాట్రిక్ ఖాయమని చెబుతుంటే..మరి కొన్ని కాంగ్రెస్ వైపు ప్రజల ఆదరణ కనిపిస్తోందని అంచనాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ పైన తమకు ఉన్న పట్టును పూర్తిగా సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లేందుకు కేసీఆర్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ తమ ప్రధాన ప్రత్యర్ధిగా బీఆర్ఎస్ గుర్తించింది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా బీజేపీ ఊసెత్తటం లేదు. బీజేపీ పైన విరుచుకుపడే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో సహజంగా ఉండే వర్గ విభేదాలు..ఎన్నికల నిర్వహణ..పోల్ వ్యూహాల్లో అనుభవం ఉన్న నేతలు తక్కువగా ఉండటంతో పరిస్థితులు..అదే సమయంలో తాము అమలు చేస్తున్న సంక్షేమం – అభివృద్ధి కలిసి వస్తాయని గులాబీ నేతలు ధీమాగా ఉన్నారు.కానీ, ఇక్కడ వీటిని గుర్తించిన కాంగ్రెస్ హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగింది. తెలంగాణ కాంగ్రెస్ లో మాణిక్ థాక్రే ఇంఛార్జ్ గా వచ్చిన సమయం నుంచి అన్ని నిర్ణయాలు సమిష్టిగా..ఢిల్లీ ఆమోదంతోనే జరుగుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తరువాత దక్షిణాదిన తమ టార్గెట్ తెలంగాణ అని పార్టీ నాయకత్వం తేల్చి చెప్పింది. కర్ణాటక తరహాలోనే గ్యారంటీ పథకాలను స్వయంగా తెలంగాణ ప్రజలకు హామీగా ప్రకటించారు. రైతుబంధుపై ప్రతిపాదనేది రాలేదు: వికాస్ రాజ్, పార్టీలపై కేసులు, కీలక అంశాల వెల్లడి అందులో మహిళలు..రైతులే లక్ష్యంగా ఈ పథకాలు ఉన్నాయి. సీట్ల కేటాయింపులో సహజంగా కాంగ్రెస్ లో కనిపించే గొడవలు..నిరసనలు ఈ సారి అంతగా లేవనే చెప్పాలి. పార్టీ నాయకత్వం గెలుపే ప్రామాణికంగా అభ్యర్దుల ఎంపిక చేసింది. ఇతర పార్టీల నుంచి నేతల చేరికల విషయంలో జాగ్రత్తలు తీసుకుంది.

 

 

Post Midle

ఇక, కాంగ్రెస్ గ్యారంటీలనే బీఆర్ఎస్ కాపీ కొట్టిందని చెప్పుకొనే అవకాశం కాంగ్రెస్ కు కలిగింది. ప్రచారంలోనూ కాంగ్రెస్ గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్దుల కోసం స్వయంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు కాంగ్రెస్ నుంచి నేరుగా అగ్రనేతలు ప్రచారంలోకి దిగారు. స్థానిక నాయకత్వం కంటే తామే నేరుగా ప్రజలకు గ్యారంటీ పథకాలు..భవిష్యత్ పాలన పైన హామీలు ఇస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ అంతర్గత సమస్యలతో కనిపిస్తోంది. మోదీ, అమిత్ షా రాజకీయం, మరోసారి కింగ్ మేకర్, దెబ్బ ఇలా పడిందని లేటుగా తెలిసింది ! పదేళ బీఆర్ఎస్ పాలన పైన సహజంగా ఉండే వ్యతిరేకత కూడా తమకే కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇక..కాంగ్రెస్ సంప్రదాయ ఓట్ బ్యాంక్ గా చెప్పుకొనే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్ బ్యాంక్ ఈ సారి తిరిగి తమ వైపే మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నిరుద్యోగుల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందనేది ఆ పార్టీ విశ్లేషణ. టీడీపీ పోటీలో లేకపోవటంతో ఏపీ సెటిర్లలో కొందరు ఓపెన్ గా తాము కాంగ్రెస్ కు మద్దతిస్తామని ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ నేతలు ఐక్యంగా ఎన్నికల్లో పని చేస్తుండటం మరో కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. మహిళల కోసం ప్రకటించిన హామీలను సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తే తమకు అధికారం ఖాయమని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్లు కనిపిస్తున్నా..ఇప్పుడు అసలు సమయం మొదలైంది. దీంతో..కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ పోరులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

 

Tags: Power fixa with six

Post Midle