శ్రీశైలం ప్రాజెక్టులో   విద్యుత్ ఉత్పత్తిని ఆపి – బొజ్జా దశరథరామిరెడ్డి.

రాయలసీమకు త్రాగు, సాగు నీరుని అందించాలి

నంద్యాల ముచ్చట్లు:

శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటి మట్టం దిగువ  నుండి విధ్యుత్ ఉత్పాదన చేపట్టడం ఆపి, రాయలసీమకు త్రాగు నీరు, సాగు నీరు లభ్యతకు క్రియాశీలక కార్యాచరణ చేపట్టాలని  కోరుతూ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డికి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేస్తూ శనివారం నాడు లేఖ వ్రాసారు. బొజ్జా దశరథ రామిరెడ్డి ఓ ప్రకటనలో శనివారము మాట్లాడుతూశ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటి మట్టం దిగువ  నుండి విధ్యుత్ ఉత్పాదన చేపట్టడం ఆపి, రాయలసీమకు త్రాగు నీరు, సాగు నీరు లభ్యతకు క్రియాశీలక కార్యాచరణ కొరకు విజ్ఞప్తి చేశారు.రాయలసీమకు  త్రాగు, సాగు నీరు లభ్యతకు శ్రీశైలం ప్రాజక్టు రిజర్వాయర్ అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే. కృష్ణా, తుంగభద్ర నదిలో ప్రవాహం మొదలై శ్రీశైలం ప్రాజక్టుకు చేరి, చేరక ముందే, శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటి మట్టం 854 అడుగులకు దిగువ నుండే తెలంగాణా రాష్ట్రం విద్యుత్తు ఉత్పత్తిని ఇప్పటికే మొదలు పెట్టింది. ఈ విధంగా తెలంగాణా  నీటిని తరలించుకొని పోవడం ప్రతి సంవత్సరం జరుతున్న తంతే. వారు విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారని, అంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా విద్యుత్తు ఉత్పత్తి చేస్తుండటం కుడా పరిపాటే. రెండు తెలు రాష్ట్రాలు పోటి పడి విద్యుత్తు ఉత్పాదన చేస్తూ శ్రీశైలం రిజర్వాయర్ కాలి చేస్తుండటం రాయలసీమ పాలిట శాపంగా మారింది

 

 

 

. ఈ తంతును నిశితంగా గమనిస్తున్న రాయలసీమ వాసులకు  రెండు రాష్ట్రాలు కూడబలుక్కొని నీటిని సాగర్ కు తరలించి  కోస్తా, నల్గొండ జిల్లా ప్రయోజనాలకు పెద్ద పేట వేస్తున్నారా అన్న భావన కల్గుతున్నది.  ఈ భావనను మొగ్గ దశలోనే  రూపుమాపడంతో పాటు,  రాయలసీమ ప్రయోజనాలకు కూడా సమప్రాదాన్యతను ఇచ్చి,  విద్యుత్తు పేరుతో నీటిని తరలించే విధానాన్ని తక్షణమే ఆపాలి. విద్యుత్ పేరుతో  కృష్ణా జలాలు సముద్రం పాలు కాకుండ ఆపి,  వెనకబడిన రాయలసీమ ప్రయోజనాలు కాపాడటానికి  కృష్ణా జలాల నిర్వహణ సమగ్రంగా చేపట్టాల్సిన అవసరం ఉంది.
రాయలసీమ బ్రతుకు తెరువుకు కీలకమైన ఇంతటి అత్యంత ప్రాధాన్యత అంశం పైన  అఖిల పక్ష సమావేశాలు ఏర్పటు చేపట్టి, సమిష్టిగా  కృష్ణా జలాల సక్రమ నిర్వహణకు కార్యాచరణ రూపొందిచాలని, రాయలసీమ చట్టబద్ద హక్కులున్న ప్రాజక్టులకు, రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన ప్రాజక్టులకు నీరు లభించాడానికి కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇదే సంధర్బంలో సమస్య తీవ్రత దృష్ట్యా మీ స్థాయి  దౌత్యం అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు .

 

Tags: Power generation stopped in Srisailam project – Bojja Dasaratharamireddy.

Leave A Reply

Your email address will not be published.