తెలంగాణలో అధికారం భాజపాదే-కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం భాజపాదేనని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన భాజపా సంకల్ప సభలో అమిత్‌ షా ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను ఎలా సీఎంను చేయాలనేదే కేసీఆర్‌ ఆలోచన అని విమర్శించారు. ‘‘ఎనిమిదేళ్లలో కేసీఆర్‌ ఒక్కసారైనా సచివాలయానికి వెళ్లారా? అందుకే కేసీఆర్‌ సచివాలయానికి వెళ్లడం లేదు. వచ్చే ఎన్నికల తర్వాత సచివాలయానికి వెళ్లే అవకాశం మాకే దక్కుతుంది. దేశం పురోగమిస్తుంటే తెలంగాణ తిరోగమిస్తోంది. తెలంగాణ ప్రజలు భాజపాకు ఒక్కసారి అవకాశమివ్వాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో మేం మద్దతిచ్చాం. గతంలో మేం 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదు. హైదరాబాద్‌ విమోచన దినాన్ని కేసీఆర్‌ వ్యతిరేకించారు. తెరాస కారు స్టీరింగ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ చేతుల్లో ఉంది. పటేల్‌ లేకుంటే హైదరాబాద్‌ రాష్ట్రం భారత్‌లో భాగం అయ్యేది కాదు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలుకుతాం’’ అని అమిత్‌ షా స్పష్టం చేశారు.

 

Tags: Power in Telangana is BJP- Union Home Minister Amit Shah

Leave A Reply

Your email address will not be published.