Natyam ad

అధికారం తనకు ముఖ్యం కాదు-మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

-కూటమిలో చేరించి తన స్వార్థం కోసం కాదు
-బీజేపీలోనే మైనారిటీలకు మేలు
-రాళ్ళసీమను రతనాల సీమ చేస్తా
-ప్రపంచంలోని అన్ని కంపెనీల్లో ఉద్యోగాలిస్తా
-సంపదను సృష్టించి జనానికి ఇచ్చేస్తా
-తనకు కరువు తెలుసుగాని కులాలు తెలియవు
-వైఎస్సార్‌సీపీ వాళ్ళు ఓటుకు పదివేలిస్తారు

పలమనేరు ముచ్చట్లు:

Post Midle

అధికారం తనకు ముఖ్యమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ కాలంసీఎంగా చేశా, ఇప్పుడు  రాష్ట్రాన్ని కాపాడేందకు వచ్చానని మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం పేరిట పలమనేరులో ఆయన స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌ను బుధవారం నిర్వహించారు. కూటమిలో చేరింది తన స్వార్థం కోసం కాదని కేవలం రాష్ట్రాన్ని బాగుచేయాలనే సంకల్పమన్నారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉంటేనే మైనారిటీలకు రక్షణ ఉంటుందని తెలిపారు. రాళ్ళసీమగా మారిన రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తన సంకల్పమన్నారు. సంపదను సృష్టించడం కేవలం టీడీపీకే తెలుసునని, ఆవిధంగా వచ్చే సంపదను ప్రజలకు పంచేస్తామని తెలిపారు. రాయలసీమలో కరువులు చూశాను గానీ ఏనాడు కులాలను చూడలేదన్నారు. ఇంట్లో ఉంటూనే ఉద్యోగాలు చేసేలా సిస్టం తీసుకువస్తానని, ప్రపంచంలోని అన్ని కంపెనీల్లో ఇక్కడి వారికి ఇంటిలోనే ఉంటూ ఉద్యోగాలు చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రపంచంలోని అన్ని కంపెనీలను మీతో అనుసంధానం చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ వాళ్ళు వచ్చే ఎన్నికల్లో ఓటుకు పదివేలిచ్చేందుకు సిద్దంగా ఉన్నారని వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకోరాదని సూచించారు.

 

 

 

తాము అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే మెగా డీఎస్సీని పెడతామన్నారు. క్రిష్ణా జలాలనే కాదు గోదావరి జలాలను సైతం రాయలసీమకు తీసుకొస్తామన్నారు. సాక్షి పత్రికకు కోట్లాదిరూపాయల యాడ్స్ ఇస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. అనంతపూర్‌కి నీళ్ళు తేవడంతోనే అక్కడికి కియా పరిశ్రమ వచ్చిందన్నారు. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చేస్తామని హామీ ఇచ్చారు. జగన్‌రెడ్డి పదిచ్చి వంద దోస్తే తాను మనిషికి పదివేలిస్తానన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని తెలిపారు. సూపర్‌సిక్స్తోపాటు బీసీలకు 50 ఏళ్ళకే పించను ఇస్తామన్నారు. ఎన్‌డీఏ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో కరెంట్‌ చార్జీలు పెంచరని అందుకు తాను గ్యారెంటీ అన్నారు. క్వాలిటీ మధ్యం తెచ్చి మధ్యం ప్రియులకు మేలు చేస్తామన్నారు. ముఖ్యంగా టీడీపీ వచ్చాక గంజాయి, డ్రగ్స్ కనిపించకుండా చేస్తామన్నారు. కూటమిలో చేరడం ఇష్టం లేకపోయినా రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి అమరనాథ రెడ్డి, చిత్తూరు ఎంపీ అభ్యర్థి డి.ప్రసాద్‌రావులు పాల్గొన్నారు.

 

Tags: Power is not important to him-former CM Chandrababu Naidu

Post Midle