అధికారం, పలుకుబడి కొన్ని కుటుంబాలకేనా ..?

Power, reputation for some families ..? - Pawan in the fight yatra

Power, reputation for some families ..? - Pawan in the fight yatra

-నన్ను సీఎం చేయండి
– కార్యకర్తల జోలికొస్తే సహించం
– మనకు జనబలమే రక్ష
– రాజీకీయాలు నేర్చుకుంటున్నా
– పోరాట యాత్రలో పవన్‌

Date:20/05/2018

శ్రీకాకుళం ముచ్చట్లు:

రాజకీయాలలో కొన్ని కుటుంబాలకే అధికారం పరిమితమైంది…. రాజకీయ పార్టీలు స్థాపించడం కష్టం…..మనకు ప్రజలే శ్రీరామరక్ష…. రాజకీయాలు నేర్చుకుంటున్నా….నన్ను సీఎం చేయండి అంటు పవన్‌ తొలి రోజు పోరాటయాత్ర శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించి, ఉధ్వేగమైన ప్రసంగం చేశారు. పోరాటయాత్రను శ్రీకాకుళం జిల్లా రాజావారిమైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ జనసేన పార్టీకి ఆర్గనైజేషన్‌ లేదని విమర్శిస్తున్నారని, పవన్‌కళ్యాణ్‌కు హేరిటేజ్‌లాంటి సంస్థలు లేవని, మాకు ప్రజలే అండగా ఉన్నారని తెలిపారు. తాను ప్రజలను మోసం చేయడాని రాలేదని ,బయపెట్టాలంటే సహించేది లేదని తెలిపారు. రాష్ట్రనికి ప్రత్యేక హ్గదా తీసుకొస్తుందంటే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చామని పవన్‌ తెలిపారు. మోసం చేసే పార్టీలకు తగిన గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సమస్యలు ఎక్కడిక్కడ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైయ్యారన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు తనకు అధికారం ఇవ్వాలని కోరారు. ఈ సభకు అధిక సంఖ్యలో జనం హాజరైయ్యారు. ప్రజలు పవన్‌ మాటలకు కరతాలధ్వనులతో మద్దతునిచ్చారు.

 

Tags: Power, reputation for some families ..? – Pawan in the fight yatra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *