బెంగళూరు సర్వీసులను ఆదరించండి – డీఎం సుధాకరయ్య

పుంగనూరు ముచ్చట్లు:

ఆంధప్రదేశ్‌ ప్రజారవాణాసంస్థ(ఏపీఎస్‌పీటీడీ) పుంగనూరు డిపో నుంచి ప్రయాణీకుల సౌకర్యం కోసం బెంగళూరుకు నడుపుతున్న రెండు సర్వీసులను ప్రజలు ఆదరించాలని డీఎం సుధాకరయ్య కోరారు. శనివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ…. పుంగనూరు నుంచి బెంగళూరుకు వయా ముళబాగలు, కోలారు మీదుగా ఉదయం 4.45నిమిషాలకు ఒక బస్సు, 6.00 గంటలకు రెండోబస్సు బయలుదేరుతాయన్నారు. వెహోదటిబస్సు బెంగళూరుకు ఉదయం 8.00కు చేరుకుని, 8.15కు, రెండోబస్సు ఉదయం 9.15నిమిషాలకు చేరుకుని 9.45కు మెజెస్టిక్‌ నుంచి బయలుదేరుతాయన్నారు. తిరిగి ఇవే బస్సులు మధ్యాహ్నం 12.15 గంటలకు వెహోదటిబస్సు, 2.15 నిమిషాలకు రెండోబస్సు పుంగనూరు బస్టాండు నుంచి బయలుదేరి బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌, సమయపాలన దృష్ట్యా టిన్‌ ఫ్యాక్టరీ వరకు నడుస్తాయన్నారు. సాయంత్రం టిన్‌ ఫ్యాక్టరీ నుంచి 4.00గంటలకు వెహోదటిబస్సు, 6.15 నిమిషాలకు రెండోబస్సు బయలుదేరి రాత్రి.7.15నిమిషాలకు, 9.30గంటలకు డిపోకు చేరుకుంటాయన్నారు. ప్రయాణీకుల సౌకర్యం కోసం బెంగళూరు బస్సు సర్వీసుల్లో చేసిన చిన్నపాటి మార్పులను గమనించి ఆర్టీసీలో ప్రయాణించి సంస్థ అభివృద్ధికి సహకరించాల్సిందిగా డీఎం సుధాకరయ్య విజ్ఞప్తి చేశారు.

 

Tags: pport Bangalore Services – DM Sudhakaraiah

Leave A Reply

Your email address will not be published.