బద్వేల్ లో ప్రభంజనంలా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం
ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో పాల్గొన్న భారీగా వైకాపా ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు
బద్వేలు ముచ్చట్లు:
బద్వేలులో శుక్రవారం ప్రభంజనముల జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి వైకాపా నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు బద్వేలు మాజీ ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కదిలారు పట్టణంలోని బావ నారాయణ నగర్ అమ్మవారి శాల వీధి మరో రెండు వీధుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి వెంట ఆయన మార్గంలో నాయకులు కార్యకర్తలు కదిలారు వెళ్లిన ప్రతిచోట వీరికి ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు ప్రజలనుండి సానుకూల స్పందన లభించింది అర్హులైన వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని వారు ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు అందుతున్నాయని ప్రజలు చెప్పడంతో నాయకుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది దళారీ వ్యవస్థ లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ప్రజలతో అన్నారు గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందని ఆయన ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు .

ప్రజల సంతోషమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకైక లక్ష్యం అని గోవింద్ రెడ్డి పేర్కొన్నారు ఈనెల ఏడో తేదీ నుండి ప్రారంభమైన జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం 20 తేది వరకు సాగుతుందని తెలిపారు రాష్ట్ర భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉందని ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు అందించాలని ఈ సందర్భంగా ప్రజలను గోవిందరెడ్డి కోరారు ఇంకా పలు విషయాల గురించి ఆయన మాట్లాడడమే కాకుండా ప్రజలు నుండి పలు విషయాలు తెలుసుకున్నారు జోరుగా సాగిన ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి వైస్ చైర్మన్లు రాచపూడి సాయి కృష్ణ గోపాల స్వామి బద్వేలు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కరెంట్ రమణారెడ్డి సివిల్ సప్లై డైరెక్టర్ సుందర రామిరెడ్డి సగర సంఘం చైర్మన్ రమణమ్మ వైకాపా నాయకులు సింగ సాని శివయ్య యద్ధారెడ్డి వెంకటేశ్వర్లు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు గృహ సారధులు పాల్గొన్నారు.
Tags; Prabhanjanamla Jagananne is our future program in Badvel
