రజిని, షారుక్ రికార్డులను ప్రభాస్ చిత్తు…1000 కోట్లపై కన్నేసిన కల్కి..

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

తెలుగు సినిమా పరిశ్రమ నిస్తేజంగా మారిన క్రమంలో 2024 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకోబోతున్న కల్కి 2898 AD మూవీ 10 రోజులుగా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల జైత్రయాత్ర కొనసాగిస్తున్నది.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, ఇండియన్ సూపర్ స్టార్స్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన ప్రధాన పాత్రల్లో.. దీపిక పదుకోన్ కీలక రోల్‌లో నటించిన ఈ చిత్రం ఇప్పటికే 900 కోట్ల క్లబ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 11వ రోజు ఈ సినిమా ఏ రేంజ్ కలెక్ష్లన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే.గత 10 రోజుల కల్కి సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా, నైజాం ప్రాంతాల్లో ఈ మూవీ 153 కోట్ల రూపాయల నికరంగా, 236 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇండియాలో అన్ని భాషల్లో 507 కోట్ల రూపాయలు గ్రాస్, 200 కోట్ల షేర్ రాబట్టింది. ఇండియాలో ఈ సినిమా 600 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇక హిందీలో ఆరంభంలో తడబాటు కనిపించినా.. తొలివారాంతం తర్వాత ఊపందుకొన్నది. హిందీలో ఇ్పటి వరకు 200 కోట్ల షేర్ రాబట్టింది. 11వ రోజు కూడా 20 నుంచి 25 కోట్ల రూపాయలు మధ్య కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఇక ఓవర్సీస్‌లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తున్నది. ఈ చిత్రం 16.5 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టింది. ఇక ఇతర దేశాల్లో కలిపి ఈ సినిమా 30 మిలియన్ డాలర్ల గ్రాస్ రాబట్టింది. దాంతో ఈ సినిమా 10 రోజుల్లో 845 కోట్లు రాబట్టింది.ఇండియాలో 11వ రోజు కలెక్షన్ల విషయానికి సవ్తే.. తెలుగులో 14 కోట్ల రూపాయలు, తమిళంలో 3 కోట్ల రూపాయలు, హిందీలో 22 కోట్ల రూపాయలు, కన్నడలో 5 కోట్ల రూపాయలు, మలయాళంలో 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా ఇండియాలో 44 కోట్ల రూపాయల నికర వసూళ్లు రాబడుతుందని పేర్కొన్నారు.ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం ఇప్పటి వరకు 30 మిలియన్ డాలర్లు వసూళ్లను సాధించింది. ఈ సినిమా యూకే, యూఎస్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. యూకేలో పొన్నియన్ సెల్వన్, జైలర్ రికార్డులను బ్రేక్ చేసింది. ప్రస్తుంద లియో, బాహుబలి 2 సినిమా కలెక్షన్లకు చేరువైంది. 11వ రోజు ఈ సినిమా ఓవర్సీస్‌లో 8.5 కోట్ల రాబడుతుందని అంచనా వేస్తున్నారు.కల్కి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 10 రోజుల్లో 845 కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబట్టింది. 11వ రోజు వరల్డ్ వైడ్‌గా 55 కోట్ల నుంచి 60 కోట్ల మధ్య వసూళ్లను రాబడుతుంది. దాంతో ఈ సినిమా 900 కోట్ల మైలురాయిని దాటి 910 నుంచి 915 కోట్లు మధ్య స్థిపడే అవకాశం ఉంది. త్వరలోనే 1000 మార్క్‌ను అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. రెండోవారంలో ఈ సినిమా ఈ రికార్డును అదిగమించే అవకాశం ఉంది.

 

 

Tags:Prabhas broke the records of Rajini and Shah Rukh…Kalki eyed on 1000 crores..

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *