Natyam ad

పుంగనూరులో ఈతమట్టలు చేతపట్టి చర్చిలో ప్రదక్షిణలు

– ఏసుకీర్తనలు
– గుడ్‌ఫ్రైడే ఏర్పాట్లపై చర్చ

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

క్రైస్తవులు మట్టల పండుగను ఆదివారం అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు. అలాగే పట్టణంలో చర్చిలలో మట్టల పండుగ సందర్భంగా క్రైస్తవులు ఏసుకీర్తనలు ఆలాపించారు. సీఎస్‌ఐ హట్టన్‌మెమోరియల్‌ చర్చిలో ఫాస్టర్‌ రాఖేష్‌నిమ్రోద్‌ ఆధ్వర్యంలో చిన్నారులు ఈతమట్టలు పట్టుకుని చర్చికి ప్రదక్షిణలు చేశారు.

పండుగ ఇలా…..

సీఎస్‌ఐ హట్టన్‌మెమోరియల్‌ చర్చిలో ఫాస్టర్‌ రాఖేష్‌నిమ్రోద్‌ మాట్లాడుతూ జెరూసెలంలో ఏసుక్రీస్తు శిలువకాబడేందుకు ఐదురోజుల ముందు రహదారిపై ఏసుక్రీస్తు గార్ధాబవం చేయడం, ఆ సమయంలో ఈతపట్టలపై నడవడం జరుగుతుందన్నారు. దీనిని పురస్కరించుకుని మట్టల పండుగ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అన్ని చర్చిలలోను ఏసుక్రీస్తు బోదనలను వినిపించడం, బైబిల్‌ను పటించడంతో పాటు ఏసుక్రీస్తు చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు. అలాగే ఆయన సూక్తులను క్రైస్తవులు అమలు చేయాలని సూచించారు. రానున్న గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌ పండుగలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ పెద్దలు రవికుమార్‌, భరత్‌భూషణ్‌, సురేష్‌ క్రిష్టఫర్‌, భాస్కర్‌, జవహార్‌ జయకుమార్‌, హేమంత్‌, సుధాకర్‌, సత్యరాజు, చిట్టి, ఉదయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Pradakshina at Ithamattalu Chetapatti Church in Punganur

Post Midle