ప్రగతి భవన్ కేంద్రంగా స్క్రిఫ్ట్ రాసి ఇస్తే చదివే మరమనుషులు         వారికి ఉద్యమ స్ఫూర్తి, చేవ లేదు: ఈటల

హైదరాబాద్ ముచ్చట్లు :
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్యమ ద్రోహులు ఎవరో, ఉద్యమ కారులు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు. పల్లా లాంటి  నేతల  గురించి మాట్లాడే స్థాయిలో లేనని అన్నారు. ప్రగతి భవన్ కేంద్రంగా స్క్రిఫ్ట్ రాసి ఇస్తే చదివే మనుషులని, మరమనుషులని, వారికి ఆ స్ఫూర్తి, చేవ లేదన్నారు. వాళ్లు ఎప్పుడు వచ్చారో, వాళ్ల చరిత్ర ఏంటో తాను చెప్పాల్సిన పనిలేదన్నారు. ఈటల రాజేందర్ శ్రమ, పోరాట పటిమ తెలంగాణ ప్రజలకు తెలుసునని అన్నారు. తన గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ల చరిత్ర కాలగర్భంటో కలిసిపోతుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.త్వరలో హుజూరాబాద్ కేంద్రంగా ధర్మానికి అధర్మానికి మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు బుద్ధిచెప్పేందుకు హుజూరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. హుజూరాబాద్ నుంచే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తారని, అక్రమ సంపాదనతో ఓటర్లను మభ్య పెడుతున్నారన్నారు. అధికార పార్టీ నేతల కుట్రలను ఇక్కడి ప్రజలు తిప్పికొడతారన్నారు. ప్రగతి భవన్ స్క్రిప్టును చదివే వారిపై తాను మాట్లాడనని.. వారి చరిత్రేంటో ప్రజలకు తెలుసు అన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Pragati Bhavan is the center of the script
They do not have the spirit of movement, Cheva: Yitala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *