మూడవ రోజు ప్రారంభమయిన ప్రజా సంగ్రామ యాత్ర

యాదాద్రి ముచ్చట్లు:


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  ఎంపీ  బండి సంజయ్  చేస్తున్నప్రజా సంగ్రామ యాత్ర మూడవ రోజు ప్రారంభమయింది. ఇవాళ భువనగిరి నియోజకవర్గం లోని గొల్లగూడెం, ముగ్ధంపల్లి, పెద్దపలుగుతండా, చిన్నరావులపల్లి, గుర్రాలదండి మీదుగా బట్టుగూడెం వరకు కొనసాగింది. యాత్ర నేపధ్యంలో బండి సంజయ్ ను పలువురు నిరుద్యోగులు కలిసి, తమ సమస్యలను చెప్పుకున్నారు.”నీళ్లు-నిధులు-నియామకాలు” అనే ట్యాగ్ లైన్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో… మాకు ఉద్యోగాలు రావడం లేదు, ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడటం లేదని వారు  వాపోయియారు,. మా సమస్యలను మీరే పరిష్కరించాలని బండి సంజయ్ ఎదుట మొరపెట్టుకున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ… తమ సమస్యలను వరుస క్రమంలో ఒక్కొక్కటిగా చెప్పుకున్నారు.

 

 

బండి సంజయ్ మాట్లాడుతూ శ్రీలంక పరిస్థితి ఎలా ఉందో… తెలంగాణలోనూ అలానే ఉంది. అక్కడా… ఇక్కడా…కుటుంబ పార్టీనే… కుటుంబ పెత్తనమే. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ ప్రభుత్వ నిర్వాకంతో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బీజేపీ దెబ్బకే… కేసీఆర్ ఫార్మ్ హౌజ్ నుంచి ధర్నా చౌక్ కి వచ్చాడు. టీఆర్ఎస్ ను  గద్దె దించి బీజేపీ ఆధ్వర్యంలో పేదల ప్రభుత్వం ఏర్పడేదాకా విశ్రమించే ప్రసక్తే లేదు. నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి బిజెపి కృషి చేస్తోంది… వారికి బీజేపీ అండగా ఉంటుందని అన్నారు.
బిజెపి అధికారంలోకి వస్తే… వెంటనే నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తేనే… కేసీఆర్ అహంకారం అంతా దిగుతుంది. బండి సంజయ్ పాదయాత్రకు నిరుద్యోగులు  సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

 

Tags: Praja Sangrama Yatra started on the third day

Leave A Reply

Your email address will not be published.