Date:25/01/2021
నంద్యాల ముచ్చట్లు:
మహానంది మండలం గాజులపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి ప్రకాశం జిల్లా వాసి మృతి చెందినట్లు నంద్యాల రైల్వే ఎస్ఐ నాగరాజు సోమవారం తెలిపారు .గుంతకల్ నుండి కమ్మం వైపు రైలు పోతుండగా ప్రమాదవశాత్తు జారిపడి కైపు. పుల్లయ్య( 85)అనే వ్యక్తి ఆదివారం అర్ధరాత్రి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ పేర్కొన్నారు. .మృతునిది పోలి నేని పల్లె చెరువు గ్రామం. వాకిట వారి పాలెం మండలం. ప్రకాశం జిల్లాగా అని గుర్తించినట్లు తెలిపారు .మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ నాగరాజు తెలిపారు .ఆయన వెంట రైల్వే హెడ్ కానిస్టేబుల్ మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Tags: Prakasam district resident dies after slipping from train