భారీ పరిశ్రమల శాఖా మంత్రిగా ప్రకాశ్‌ జవదేకర్‌

Prakash Javadekar as Minister of Heavy Industries

Date:12/11/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

మహారాష్ట్రలో బీజేపీ – శివసేన పార్టీల మధ్య విభేదాల నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి సోమవారం రాజీనామా చేసిన సేన నేత అరవింద్‌ సావంత్‌ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన నిర్వహించిన శాఖకు మంత్రిగా కేబినెట్‌ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను నియమించారు. ప్రధాన మంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్రపతిభవన్‌ వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. ప్రకాశ్‌ జవదేకర్‌ ఇప్పటికే పర్యావరణ, అటవీ, సమాచార శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు వీటికి అదనంగా భారీ పరిశ్రమల శాఖా మంత్రిగా కూడా వ్యవహరించనున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్‌ కొనసాగుతోంది.

 

నవంబర్ 14 నుంచి నంబర్ 21 వరకూ ఇసుక వారోత్సవాలు

 

Tags:Prakash Javadekar as Minister of Heavy Industries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *