రాజ‌కీయాల్లో స్వతంత్ర అభ్యర్ధిగా ప్రకాశ్ రాజ్

Prakash Raj is an independent candidate in politics

Prakash Raj is an independent candidate in politics

Date:01/01/2019
చెన్నై ముచ్చట్లు:
 ఫిల్మ్ స్టార్‌ ప్ర‌కాశ్ రాజ్ .. రాజ‌కీయాల్లో ప్ర‌వేశించ‌నున్నారు. ఈ ఏడాది జ‌రిగే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో.. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్నారు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా విషెస్‌ ట్వీట్ చేసిన ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కొత్త సంవ‌త్స‌రం, కొత్త ప్రారంభం, కొత్త బాధ్య‌త అంటూ ఆయ‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయ‌నున్న‌ట్లు, నియోజ‌క‌వ‌ర్గ వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్న‌ట్లు చెప్పారు. జ‌ర్న‌లిస్టు గౌరీ లంకేశ్ హ‌త్య త‌ర్వాత‌.. ప్ర‌కాశ్ రాజ్ రాజ‌కీయాల‌పై ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌కాశ్ ట్వీట్ చేయ‌గానే ఆయ‌న‌కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు వెల్లువెత్తాయి. మ‌రోవైపు సౌత్ ఫిల్మ్ స్టార్స్ క‌మ‌ల్ హాస‌న్‌, రజ‌నీకాంత్‌లు కూడా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే.
Tags:Prakash Raj is an independent candidate in politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed