మతోన్మాద హత్యలను అరికట్టేందుకు ప్రణయ్ చట్టాన్ని తీసుకురావాలి భారతీయ అంబెడ్కర్ సేన నేత శివప్రసాద్

Pranai has to bring the law to prevent communal violence

Pranai has to bring the law to prevent communal violence

వి.కోట ముచ్చట్లు:

దేశంలో ఎక్కడచూసినా కులం, మతం ఆధారంగా పరువు పేరిట మతోన్మాదులు చెలరేగిపోతున్నారని, పరువు హత్యలకు పాల్పడుతున్నారని భారతీయ అంబెడ్కర్ సేన నేత పిటిఎమ్ శివప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక బిలీవర్స్ చర్చి నందు జరిగిన బాస్ జిల్లా కార్య నిర్వాక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కుల, మతాల ఆదారంగా సమాజంలో చోటుచేసుకుంటున్న పరువు హత్యలను అరికట్టడానికి ప్రభుత్వం ‘ ప్రణయ్ ‘ చట్టాన్ని తీసుకు రావాలని డిమాండ్ చేసారు.

అంబేద్కర్ సేన ఆరేళ్లుగా ప్రస్థానంలో సాధించిన విజయాలు ఎదుర్కొన్న ఒడిదుడుకులు కష్టనష్టాలపై జిల్లా కార్యనిర్వాహక కమిటీ సమీక్ష జరిగింది రాబోయే 2019 ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ లు సమస్యలు ప్రధాన ఎజెండాగా తెరపైకి తెచ్చేందుకు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించింది. విద్యా, వైద్యం, భూమి, ఉపాధి, ఉద్యోగం లక్ష్యంగా సుమారు 20 అంశాలు బహుజన ఎజెండా రూపొందించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ మతం వాదం కంటే తీవ్రమైనది కుల ఉగ్రవాదం అని దీన్ని నిర్మూలించడంలో పాలక ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఇందుకు కారణం పాలక ప్రభుత్వాలు కులతత్వం తో నిండి ఉండటమే ఉండడమే అని విమర్శించారు.

ఏడు దశాబ్దాలు దాటినా కుల నిర్మూలన విధానాలపై ఈ ప్రభుత్వాలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని దుయ్యబట్టారు తత్కారణంగా కన్న బిడ్డలను వారు కట్టుకున్న భర్తను హతమార్చిన కసాయి తల్లి తండ్రులు అని ఆయన వ్యక్తం చేశారు.

కులం మతం ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు కుల ఉన్మాదం ప్రభుత్వాలను చమరగీతం పాడి బహుజన చేతికి రాజకీయాధికారం అందించడానికి సమయం కావాలని అంబేద్కర్ కమ్యూనిస్టులు శిబిరాలకు శివప్రసాద్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గణపతి, చందు, లయన్ శ్రీనివాసులు, దొరస్వామి, సురేంద్ర, వినోద్, అనిల్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గట్టయ్య  మృతి 

Tags:Pranai has to bring the law to prevent communal violence

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *