వాకాడు ఎక్సైజ్ (ఎస్ఈబి)సిఐ గా ప్రసన్న లక్ష్మి  పదవీ బాధ్యతలు

నెల్లూరు  ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా, వాకాడు మండల ఎక్సైజ్( ఎస్ ఈ బి) సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రసన్న లక్ష్మి మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా సిఐ ప్రసన్న లక్ష్మి  స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తాను నెల్లూరు జిల్లా , బుచ్చిరెడ్డిపాలెంలో పమిచేస్తూ, బదిలీపై వాకాడు ఎక్సైజ్ సర్కిల్ పోలీస్ స్టేషన్ కు వచ్చానని ఆమె తెలిపారు . సర్కిల్ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు మండలాలలో  అక్రమ మద్యం, ఇసుక, గుట్కాల  పై గట్టి నిఘా ఉంచి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సర్కిల్ పరిధిలో సమాచారం అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచబడతాయిని తెలిపారు. ప్రజల సహకారం ఉంటేనే అవినీతి రహిత సమాజాన్ని సృష్టించే అవకాశం ఉందన్నారు. ప్రజలు తమ సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Prasanna Lakshmi assumes duties as Wakadu Excise (SEB) CI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *