కుంభమేళాకు సిద్ధమవుతున్న ప్రయాగ్ రాజ్

Prayag Raj is preparing for Kumbh Mela

Prayag Raj is preparing for Kumbh Mela

Date:09/01/2019
లక్నో ముచ్చట్లు:
కుంభమేళాకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సిద్ధమవుతోంది. ఈ నెల 15 నుంచి 4 వరకు జరిగే ఈ మేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తాత్కాలికంగా ఒక నగరాన్నే నిర్మిస్తోంది. ఈ కుంభమేళకు దేశ విదేశాల నుంచి 12 కోట్లకు పైగా భక్తులు విచ్చేస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా ప్రభుత్వం కొత్తగా 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 22 పంటూన్ వంతెనలు, 40,000 ఎల్‌ఈడీ బుల్బులు ప్రత్యేకంగా ఒక నగరాన్ని నిర్మిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద తాత్కాలిక నగరమని ప్రభుత్వం వెల్లడించింది. యునెస్కో  ఇప్పటికే కుంభమేళాను సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించిన సంగతి తెలిసిందే.
ఈ సారి కుంభమేళాలో పాల్గొనే భక్తులకు ‘అక్షయ్ వాత్’, ‘సరస్వతి కూప్’ వద్ద ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. 450 ఏళ్ల కుంభమేళ చరిత్రలో ఈ అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. కుంభమేళ ఏర్పాట్లు కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2800 కోట్లు కేటాయించింది. అయితే, పనులన్నింటీకి సుమారు రూ.4,300 కోట్లు వ్యయం కావచ్చని అంచన వేస్తోంది. 2013లో జరిగిన కుంభమేళకు ప్రభుత్వం రూ.1,214 కోట్లు వెచ్చించడం గమనార్హం. ‘ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో కుంభమేళ నిర్వహిస్తున్నాం.
ఇందులో భాగంగా ప్రభుత్వం నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతోంది. విమానం, రోడ్, రైలు మార్గాల్లో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకునే భక్తులు, యాత్రికులు, పర్యాటకుల సౌకర్యార్థం తొలిసారిగా భారీగా ఏర్పాట్లు చేశాం’ అని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. 71 దేశాలకు చెందిన రాయబారులు ఇప్పటికే కుంభమేళా ఏర్పాట్లు పరిశీలించారని, మేళా జరిగే త్రివేణి సంగమం వద్ద ఆయా దేశాల జాతీయ జెండాలను ఎగురవేస్తారని పేర్కొంది.
Tags:Prayag Raj is preparing for Kumbh Mela

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *