ఇడుపలపాయలో వైఎస్ షర్మిల ప్రార్ధనలు

కడప   ముచ్చట్లు:
ఇడుపులపాయలోని దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్  రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద వైఎస్సార్ జయంతి సందర్భంగా  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ , వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి నివాళులు ఆర్పించారు.   తెలంగాణలో నేడు నూతన  పార్టీ జెండా అజెండాను ప్రకటించనున్న నేపధ్యంలో, ఆమె తండ్రి సమాధి పై నూతన పార్టీ జెండాను ఉంచి  ప్రార్ధనలు చేసారు. ఇడుపులపాయ నుంచి రోడ్డు మార్గాన కడప విమానాశ్రయం చేరుకుని, అక్కడ నుంచి  ప్రత్యేక విమానంలో తెలంగాణకు బయలుదేరి వెళ్లారు. ఆమెతో  పాటు నివాళులర్పించిన వారిలో  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సీనియర్ నాయకులు కొండా రాఘవ రెడ్డి, బ్రదర్ అనిల్, దుర్గయ్య పల్లె మల్లికార్జున రెడ్డి,  మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైయస్ సునీత రెడ్డి,   షర్మిల పార్టీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Prayers of YS Sharmila in Idupalapaya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *