ముందస్తుగా సిద్దమయిన అధికార యంత్రాంగం
రాజమహేంద్రవరం ముచ్చట్లు:
గోదావరికి వరదలు వస్తాయని ముందు చూపుతోనే ఆలోచించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై 12 వ తారీఖున జిల్లా యంత్రాంగాలు ముందస్తు గా సిద్దం చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
ఆర్ అండ్ బి అతిథిగృహంలో పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ రూడా చైర్ పర్సన్ ఎం షర్మిలా రెడ్డి, స్థానిక నాయకులు చందన నాగేశ్వర్ తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 5 జిల్లాలలో గోదావరి వరదల వలన లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాలు ముంపుకు గురి అవుతాయని గుర్తించి ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశామన్నారు. గోదావరిలో వరద నీరు పెరగడం, ధవళేశ్వరం వద్ద 26 లక్షల క్యూసెక్కుల నీరు చేరడం జరిగిందన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, ఎక్కడ గండి పడకుండా ఎక్కడికక్కడ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని మంత్రి తానేటి వనిత తెలిపారు. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఇసుక మూటలు వేసి పటిష్టం చెయ్యడం జరిగిందన్నారు. ముంపు ప్రాంతాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చెయ్యడమే, కాకుండా ఇంటింటికీ నిత్యావసర సరుకుల ను ఇంటి వద్దకే చేర చేశామన్నారు. కొన్ని ప్రాంతాల్లో పశువులు ఉండడం వల్ల, వాటి సంరక్షణ కోసం పునరావాస కేంద్రాలకు రానీ వారికి నిత్యావసర సరుకులను అండచెయ్యడమే కాకుండా , ముంపు ప్రమాదం ఉంటే వారిని తరలించేందుకు వ్యవస్థ ను సిద్దంగా ఉంచామని తెలిపారు. విద్యుత్ సమస్య రాకుండా చర్యలు తీసుకోవడం, వరద అనంతరం పునరుద్దరణ పనులు చేపట్టడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
వరదల సమయంలో ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఇంకా కొనసాగిస్తునట్లు తెలిపారు. ఆయా ప్రాంతాలలో ప్రజలకు కావలసిన ఏర్పాట్లు చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం చక్కటి పనితీరు చూపుతున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి విపత్తు సమయంలో స్పందించారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రతిదీ రాజకీయం చేయడం తగదన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రతిపక్ష నేత రావడం జరిగిందన్నారు. ప్రజలకు ఏమి అందుతున్నాయి, ఏమి కావాలో తెలుసుకోవాలని, మరింత మెరుగ్గా సేవలు అందించే క్రమంలో నిర్ణయాత్మక మైన సూచనలు, సలహాలు ఇవ్వడం పోయి విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజల తక్షణ అవసరాల కోసం ప్రభుత్వం రూ. 41 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.
Tags: Pre-prepared bureaucracy