ముందు జాగ్రత్తలేవీ..? (ఆదిలాబాద్)

Date:12/07/2018
ఆదిలాబాద్ముచ్చట్లు:
వర్షాకాలానికి ముందే కాలానుగుణ వ్యాధుల పట్ల అన్ని చర్యలు తీసుకున్నామన్న అధికారుల మాటలు నీటి మూటలయ్యాయి. తాంసి మండలం అట్నంగూడలో బుధవారం జరిగిన సంఘటన దీనికి నిలువుటద్దం. ప్రతి వర్షాకాలం నీటి కాలుష్యం కారణంగా అతిసారం విజృంభించటం పరిపాటిగా మారింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం కొరవడటం, రక్షితనీరు అందుబాటులో లేకపోవటం ప్రధాన కారణాలు. ఈ విషయంలో అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరించటం వల్లనే తాంసి మండలంలో అతిసారానికి ఇద్దరు బలైపోవటంతో పాటు మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు.తాంసి మండలంలోని అట్నంగూడలో వారం రోజులుగా గ్రామస్థులు అతిసారం  బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. అయితే సకాలంలో వైద్య సిబ్బంది స్పందించకపోవటం వల్లనే ఇద్దరు మృత్యువాత పడినట్లు విమర్శలు వస్తున్నాయి. బుధవారం ఇద్దరు మృతి చెంది మరో 12 మంది రిమ్స్‌కు సాయంత్రం సమయంలో చేరుకున్నారు. ఈ సంఘటన విషయం సాయంత్రం జిల్లా కేంద్రంలోని వైద్యాధికారులకు ‘న్యూస్‌టుడే’ సమాచారం అందించే వరకు స్థానిక పీహెచ్‌సీ స్పందించలేదు. దీన్ని బట్టి వైద్యాధికారులు ఎంత మేర అప్రమత్తంగా ఉంటున్నారో అర్థమవుతోంది.జిల్లాలో ఏజన్సీ ప్రాంతాలైన నార్నూర్‌, జైనూర్‌, సిర్పూర్‌(యు), ఇంద్రవెల్లి, సిరికొండ తదితర ప్రాంతాల్లో ప్రబలే అవకాశాలున్నాయి. ఈ మండలాల్లోని గ్రామాల్లో సరైన రక్షిత నీటి సౌలభ్యం లేకపోవటం, పారిశుద్ధ్యం లోపించటం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో వైద్యారోగ్య శాఖతో పాటు పని చేయాల్సిన వివిధ శాఖల సమన్వయలోపమే జిల్లా ప్రజలకు శాపంగా మారింది. వైద్యాధికారులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు. కానీ పంచాయతీ రాజ్‌, తాగు నీటి విభాగం అధికారులు మాత్రం ఈ మేరకు స్పందించటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చాల్సిన ఆ శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లనే వ్యాధులు ప్రబలి వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకుంటున్నామని అధికారులు పేర్కొంటున్నప్పటికీ ప్రతి ఏడాది జిల్లాలో అతిసారం విజృంభిస్తూనే ఉంది. వేలల్లో జిల్లా వాసులు గిరిజన, గిరిజనేతర ప్రాంతం అనే తేడా లేకుండా ఇది వ్యాపిస్తోంది. అధికారులు మాత్రం ఎవరూ మృతి చెందలేదని చెబుతున్నారు. ఎంతోమంది అతిసారం బారిన పడి మృతి చెందుతున్నారు. కానీ వైద్యశాఖ మాత్రం దీన్ని ధ్రువీకరించటం లేదు. అయిదు సంవత్సరాలుగా అతిసార(డయేరియా) బారిన పడ్డ వారి వివరాలు ఇలా ఉన్నాయి.
ముందు జాగ్రత్తలేవీ..? (ఆదిలాబాద్) https://www.telugumuchatlu.com/precautions-adilabad/
Tags:Precautions ..? (Adilabad)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *