పుంగనూరులో ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు అవసరం-రవాణాశాఖాధికారి రవీంద్రనాయక్
పుంగనూరు ముచ్చట్లు:
వాహనదారులు ప్రమాదాలను నివారించేందుకు జాగ్రత్తలు పాటించాలని రవాణాశాఖాధికారి రవీంద్రనాయక్ తెలిపారు. శనివారం పట్టణంలో రహదారి భద్రత వారోత్సవాలను ఎస్ఐ మోహన్కుమార్తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాయక్ మాట్లాడుతూ ప్రతియేటా జనవరి నెలలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. జెటిసి బషిరెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులకు, డ్రైవర్లకు రహదారి జాగ్రత్తలు గురించి వివరిస్తున్నామన్నారు. ప్రయాణించే సమయంలో మధ్యం సేవించడం, సెల్ఫోన్లో మాట్లాడటం, రహదారి సూచనలను పాటించడం వాహనదారులు అలవర్చుకోవాలన్నారు. మితిమీరిన వేగంతో వాహనాలను నడపరాదన్నారు. రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో ప్రమాదాలు జరిగితే అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో పాటు వారి కుటుంభాలు వీధినపడుతున్నాయన్న విషయాన్ని గమనించి వాహనాలను నడపడం అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ పురుషోత్తంరెడ్డి, వాహనడ్రైవర్లు, యజమానులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags: Precautions are needed to prevent accidents in Punganur-Transport Officer Ravindra Naik
