కరోనా నియంత్రణ కోసం ముందస్తు చర్యలు- మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:
 
కరోనా, ఒమిక్రాన్‌ నియంత్రణ కోసం ముందస్తు చర్యలు పకడ్భంధిగా చేపట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో జగనన్న ప్రాణవాయువు కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో ప్రారంభించగా, స్థానిక కేంద్రాన్ని మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, రెడ్డెప్ప, కలెక్టర్‌ హరినారాయణ్‌ కలసి ప్రారంభించారు. అలాగే ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ నాగశైలజ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ సిబ్బందికి యూనిఫాంలు, పీప్రైమరీ పుస్తకాలను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వము చేపట్టని విధంగా ప్రజల ఆరోగ్యానికి వైఎస్సార్‌సిపి ప్రభుత్వం అగ్రస్థానం కల్పించిందన్నారు. కడప, చిత్తూరు ప్రాంతాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.4 కోట్లు, ఎంపి మిధున్‌రెడ్డి కోటి రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలు కరోనా భారిన పడి ఇబ్బందులు పడకుండ ఉండేందుకు ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చేతులు మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్లాంట్లు ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. వైద్యశాఖలో ఖాళీలన్ని త్వరలోనే భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలందరు ప్రభుత్వ వైద్యశాలను వినియోగించుకుని, ఉచిత వైద్యసేవలు పొందాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చిన్న పిల్లల సంక్షేమం కోసం ముందుజాగ్రత్తగా మెను ను స్వయంగా ఏర్పాటు చేశారన్నారు. గతంలో ముఖ్యమంత్రులు ఓటర్లను ఆకట్టుకునేందుకు సహాయం చేసేవారని, కానీ మన ముఖ్యమంత్రి అంగన్‌వాడీ పిల్లల ఆరోగ్యంగా ఉండేందుకు నిర్ధిష్టమైన పథకాలు ఏర్పాటు చేసి, వారికి ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేశారని కొనియాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిమూలం, జంగాలపల్లె శ్రీనివాసులు, సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, డిఎంఅండ్‌హెచ్‌వో శ్రీహరి, డిసిహెచ్‌ఎస్‌ సరళమ్మ, జిల్లాఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ రాజశేఖర్‌రెడ్డితో పాటు ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, చైర్మన్‌ అలీమ్‌బాషా, ఏపిఐఐసిడి చైర్మన్‌ షమీమ్‌అస్లాం, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
 
Tags: Precautions for Corona Control- Minister Peddireddy

Natyam ad