108లో గర్భిణీ ప్రసవం

– తల్లీబిడ్డ క్షేమం
– ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన తల్లితండ్రులు

Date:13/08/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

108 వాహనంలోనే హైరిస్క్ కేసు గల ఓ గర్భవతి సుఖ ప్రసవమై పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంఘటన గురువారం బోయకొండ సమీపంలో జరిగింది. మండలంలోని గజ్జలవారిపల్లెకు చెందిన హేమప్రశాంతి నిండు గర్బిణి. పురిటి నొప్పులు రావడంతో హైరిస్క్ కేసు కావడంతో వైద్యుల సూచనలమేరకు వారి ఇంటి నుంచి 108 సిబ్బంది గణేష్‌,చిట్టిబాబులతోపాటు ఆశ కార్యకర్తలు కలిసి మదనపల్లెకు తీసుకెళ్తున్నారు. నొప్పులు తీవ్రంగా కావడంతో ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో కొనుగోలుచేసిన కొత్త వాహనంలోనే కాన్పు చేశారు.పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో బిడ్డ తల్లితండ్రులు 108 వ్యవస్థను ప్రవేశపెట్టినమహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి , సీఎం జగన్‌మోహన్‌రెడ్డికు, సకాలంలో స్పందించి సేవచేసిన సిబ్బందికి కృతజ్ఞతలు తె లిపారు.

మదనపల్లి డివిజన్ లో 43 పోసిటివ్ కేసులు

Tags: Pregnant childbirth in 108

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *