మగాళ్లకు గర్భనిరోధక మాత్రలు

Pregnant pills for males

Pregnant pills for males

Date:25/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
చాలామంది కెరీర్ లో ఎదుగుదలకోసమో, పిల్లలని కనేవయసు ఇంకా రాలేదనో, కుటుంబాన్ని ప్రారంభించడానికి ఇది సరైన టైమ్ కాదనో ఇలా రకరకాల కారణాలతో పిల్లలను ఆలస్యంగా కనాలనుకుంటారు. ఇప్పటి వరకు గర్బనిరోధక పద్దతులు ఎక్కువగా స్త్రీలకు మాత్రమే ఉన్నాయి. అయితే  కొత్తగా పురుషులకు కోసం కూడా శాస్త్రవేత్తలు గర్భనిరోధక టాబ్లెట్స్‌ ను తయారుచేస్తున్నారు. గర్భనిరోధక పద్ధతులు ఎక్కువ శాతం మహిళలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. వాటి వలన కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నాయి. పురుషులకు వాసెక్టమీ, కండోమ్స్ ఈ రెండుమత్రమే అందుబాటులో ఉన్న గర్భనిరోధక పద్ధతులు. తర్వాత శాస్త్రవేత్తలు హార్మోన్‌ కలిగిన జెల్స్ ని తయారుచేశారు. దీని వల్ల మగవారిలో సంతాన సామర్ధ్యాన్ని తగ్గించవచ్చని నిరూపించారు. కాని వీటితోనూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అందుకే సరికొత్తగా..  సురక్షితమైన, ప్రభావవంతమైన గర్భనిరోధక డ్రగ్ ను మగవారి కోసం రూపొందించారు శాస్త్రవేత్తలు. పురుషుల కోసం EP055 అనే గర్భనిరోధక మాత్రను తయారుచేసినట్లు యూనివర్శిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా ఈ టాబ్లెట్ తో పురుషుల హార్మోన్స్ లో ఎటువంటి మార్పులు సంభవించవని, ఇది కేవలం శుక్రకణాల కదలికలపైనే ప్రభావం చూపి సంతానాన్ని నిరోధిస్తుందని పేర్కొన్నారు.మానవుని వీర్యంలో కోట్ల సంఖ్యలో శక్రకణాలు ఉంటాయి. ఇవి వీటికుండే తోకల సహాయంతో చురుకుగా ఈదుకుంటూ వెళ్తాయి. వీటిలో ఒకటి మాత్రమే  ఫలదీకరణ కోసం సిద్ధంగా ఉన్న అండాన్ని చేరుతుంది. EPO55 డ్రగ్‌ని కోతులపై ప్రయోగించినప్పుడు అది శుక్రకణం యొక్క ఈత కొట్టే సామర్ధ్యాన్ని30 గంటల పాటు నిరోధించింది. అంతేకాకుండా ఈ డ్రగ్‌ వీర్యంలో 78 గంటలపాటు తన ఉనికిని కలిగిఉంటుంది. కాబట్టి దీనిని వాడటం వలన సుమారు రెండు రోజుల పాటు గర్బాన్ని రాకుండా అడ్డుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. EPO55 టాబ్లెట్ వాడటం వలన ఎటువంటి సైడ్‌ ఎపెక్ట్స్ కూడా కలగలేదని, 18 రోజుల్లో వీర్యంలోని శక్రకణాల కదలికల స్థాయి మామూలు స్థితికి చేరిందని సైంటిస్ట్‌ ల పరిశోధనల్లో తేలింది. కోతులపై విజయవంతమైన EPO55ను మనుషులపై ప్రయోగించాల్సి ఉంది. ఈ టెస్ట్ లు సక్సస్ అయితే త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకొస్తామని పరిశోధకులు తెలిపారు..
Tags:Pregnant pills for males

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *