గర్భిణీ మృతి..బంధువుల అందోళన
యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:
చౌటుప్పల్ మండల కేంద్రం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి ఐదు నెలల గర్భిణీ మృతి చెందింది. నాగారం గ్రామానికి చెందిన వడ్డేపల్లి శివాని ఐదు నెలల గర్భవతి… గర్భం దాల్చిన నాటి నుండి ప్రశాంతి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుంది. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకుంది. కానీ మరోసారి అనారోగ్యం పాలు కావడంతో ఆసుపత్రికి వచ్చిన ఆమెకు చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్లాలని సూచించారు ప్రశాంతి హాస్పిటల్ వైద్యులు.. హైదరాబాద్ వెళ్లేసరికి కడుపులో బిడ్డ చనిపోయిందని చనిపోయిన శిశువు విషపూరితం కావడంతో పరిస్థితి విషమించి గర్భిణి మృతి చెందినదని డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో ప్రశాంతి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే శివాని మృతి చెందిందని బంధువుల ప్రశాంతి హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Pregnant woman dies .. Relatives worried