ప్రేమోన్మాది ఘాతుకం..

-ఇద్దరు సజీవ దహనం
-నలుగురికి గాయాలు

Date:22/01/2020

కాకినాడ  ముచ్చట్లు:

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దారుణం జరిగింది. మండలంలోని దుళ్ల గ్రామంలో  లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తానుప్రేమించిన అమ్మాయి తో పెళ్ళి చేయలేదని కసితో రగిలిపోయాడు. నిద్రిస్తున్న అమ్మాయి కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఘటనలో ఇద్దరు చిన్నారులు సజీవదహనం అయి తనువులు చాలించారు. గా మరో ఇద్దరు ఎనభైశాతం గాయాలతో కొన ఊపిరితో వుండగా వారిని  రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు చిన్నారులకు గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా వున్నాయి. నిందితుడు శ్రీనివాస్ తన దగ్గరి బంధువయిన అమ్మాయిని ప్రేమించాడు. కారణాలు ఎమైనా,  శ్రీనివాస్ తో ముందుగా పెళ్ళి చేయడానికి ఒప్పుకున్నా అతని ప్రవర్తన బాగోలేక వేరే అబ్బాయికిచ్చి ఏడాదిన్నర క్రితం వివాహం చేసారు.దాంతో నిందితుడు ఆ కుటుంబంపై పగ పట్టాడు. ఈ నెల 17 రాత్రి వచ్చి అమ్మాయి తల్లిని ని కత్తితో నరికాడు.దీనిపై పోలీసులకు పిర్యాదు చేసారు. గాయాలపాలయిన తల్లిని చూడడానికి ఆమె పెద్ద కుమార్తె దుర్గాభవాని పిల్లతో కలిసి పరామర్శ కు భీమవరం నుంచి  వచ్చింది. మంగళవారం రాత్రి నిందితుడు మరోసారి బాధితుల ఇంటికి వచ్చాడు.  నిద్రిస్తున్న వారి గదిలో పెట్రోల్ పోసి గడియపెట్టాడు.దీంతో మంటల్లో అమ్మాయి తమ్ముడు కోట్ని రాము(18),అక్క కుమార్తె విజయలక్ష్మి (5) సజీవ దహనం అయ్యారు.తల్లి సత్యవతి, అక్క దుర్గా భవాని లు చావు బతుకుల మధ్య ఉన్నారు.అక్క కుమారులు ఏసు కుమార్,దుర్గా మహేష్ లకు గాయాలయ్యాయి. శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు.

టీడీపీకి వరుస షాక్ లు

Tags: Premonition is worse ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *