విశాఖలో ప్రేమోన్మాది

Date:02/12/2020

విశాఖపట్టణం ముచ్చట్లు:

విశాఖలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య మరువక ముందే మరో ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రియురాలిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. విశాఖ వన్‌టౌన్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఫెర్రివీధికి చెందిన యువతి వాలంటీర్‌గా పనిచేస్తోంది. ఆమె మరొకరితో చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్న ప్రియుడు శ్రీకాంత్ ఆమెపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.యువతి ఇంట్లో ఉన్న సమయంలో మెడపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. దాడి అనంతరం శ్రీకాంత్ హత్యాయత్నం చేసినట్లు ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. అనంతరం శ్రీకాంత్ కూడా మెడపై కత్తితో దాడి చేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గమనించి ఇద్దరినీ కేజీహెచ్ కు తరలించారు. ప్రియాంక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇద్దరూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

ఫైజర్ టీకా రెడీ

Tags; Premonmadi in Visakhapatnam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *