మాచర్ల అంబెడ్కర్ పార్క్ వద్ద దీక్షకు సన్నాహాలు

Preparations for the initiation at the Matters Ambedkar Park

Preparations for the initiation at the Matters Ambedkar Park

-ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు
Date:16/11/2018
మాచర్ల ముచ్చట్లు:
పల్నాడు ప్రాంత రైతుల కల వరికపూడిసెల సాగునీటి ప్రాజెక్ట్ ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మాచర్ల అంబెడ్కర్ పార్క్ వద్ద ఈనెల 20వ తేదీన “వరికపూడిసెల సాధన దీక్ష” నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరమ్ (ఏపీజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణా0జనేయులు వెల్లడించారు.
ఇక్కడి మెడికల్ అసోసియేషన్ హాల్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎగువ పల్నాడుతో పాటు ప్రకాశం జిల్లాలోని పుల్లల చెరువు , వినుకొండ, బొల్లాపల్లి మండలాలలో ని 4.5 లక్షల మంది రైతులకు వరికపూడిసెల ప్రాజెక్ట్ ద్వారా ఉపయోగం జరుగనుందన్నారు. 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ ను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
సామాజిక బాధ్యత తో జర్నలిస్టులుగా తాము పలనాడు అభివృద్ధి కోసం అధ్యయనం ప్రారంభించామని దాంట్లో భాగంగానే రైతుల విజ్ఞప్తి మేరకు సాధన దీక్షకు పూనుకున్నట్లు తెలిపారు. పల్నాడు ప్రాంత రైతులు, విద్యార్థి, యువజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని వరికపూడిసెల సాధన దీక్షను ఆయప్రదం చేయాలని కృష్ణఅంజనేయులు విజ్ఞప్తి చేశారు. రైతులంతా కదలిరావాలి:
సాయి మార్కండేయ రెడ్డి రాజకీయాలకు అతీతంగా రైతులంతా వరికపుడిశల సాధన దీక్షకు తరలి రావాలని చక్రధర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వరికపుడిశల సాధన ఉద్యమ నాయకులు కుర్రి సాయి మార్కండేయ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అన్నారు.కొన్ని దశాబ్దాల కాలంగా వరికపుడిశల కోసం ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నామన్నారు. రైతులకు మద్దతుగా ఏపీ జర్నలిస్టులు ముందుకు రావడం హర్షణీయం అన్నారు.
Tags:Preparations for the initiation at the Matters Ambedkar Park

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *