ఆక్రమణలపై  ఉక్కు పాదానికి సిద్ధం

Date:20/08/2019

అదిలాబాద్‌ ముచ్చట్లు:

అదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని సర్వే నంబర్ 170లో 49 ఎకరాల స్థలం లో సర్వే చేపట్టారు.భూమిలో గతంలో అధికారులు ఇళ్లస్థలాలు లేని పేదలకు కేటాయించారు. పట్టణం క్రమంగా విస్తరించడంతో ఈ స్థలానికి డిమాం డ్ బాగా పెరిగింది. ఈ భూమి విస్తీర్ణం 49 ఎకరాలుండగా.. అధికారులు 1279 ప్లాట్లను చేసి పేదలకు పంపిణీ చేశారు. ఇదే అవకాశంగా భా వించిన కొందరు అనర్హులు, కబ్జాదారులు ఈ స్థలాలపై కన్నేసి పలు ప్లాట్లను స్వాధీన పర్చుకున్నారు.

 

 

 

 

దీంతో పాటు చాలా మంది ప్రభుత్వానికి సంబంధించిన ఈ భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా నివాసాలను ఏర్పర్చుకున్నారు. మరికొందరు కబ్జాలు చేసుకొని ఇతరులకు విక్రయించారు. వీటిపై స్పందించిన అధికారులు ఈ సర్వే నంబర్‌కు చెందిన భూమిలో ని పూర్తి వివరాలు సేకరించాలని నిర్ణయించా రు. భూమిని సర్వే చేసేందుకు ముగ్గురు అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేశా రు.

 

 

 

ఒక్కో బృందంలో ఒక డిప్యూటీ తహసీల్దా ర్, ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, వీఆర్‌వో ఉంటారు. ఈ బృందం సభ్యులు రెవెన్యూ రికార్డుల ఆధారంగా సర్వే నిర్వహిస్తున్నారు. 1279 ప్లాట్లలో ప్రభుత్వం మంజూరు చేసినవి ఎన్ని? అధికారులు పంపిణీ చేసిన భూమిలో అర్హులున్నా రా? వారు అక్కడ నివాసం ఏర్పర్చుకున్నారా? లేదా? ఇతరులకు విక్రయించారా? అనధికారికంగా ఎంత మంది భూమిని ఆక్రమించారు? కబ్జాలు ఎన్ని ఉన్నాయి? అనే విషయాలను రి కార్డుల ఆధారంగా పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు నాలుగైదు రో జుల్లో తెలిసే అవకాశం ఉందని రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ తెలిపారు.

 

మళ్లీ భయపెడుతున్న స్వైన్‌ టెర్రర్‌ 

Tags: Prepare for steel enclosures

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *