అళగిరి  రీ ఎంట్రీకి అంతా సిద్ధం

Prepare for the re-entry of Alagiri

Prepare for the re-entry of Alagiri

Date:21/11/2019

చెన్నై ముచ్చట్లు:

తమిళనాడు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పార్టీని విజయం దిశగా పయనింప చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఇటు అధికార అన్నాడీఎంకే, అటు ప్రతిపక్ష డీఎంకే వచ్చే ఎన్నికల్లో పొత్తులతో ముందుకు వెళతాయన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రజనీకాంత్ కొత్త పార్టీ కూడా వస్తుంది. కమల్ హాసన్ ఇప్పటికే ఎన్నికలకు వెళ్లి వచ్చారు. ఇటువంటి పరిస్థిితుల్లో డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరి భవితవ్యం ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది.ఆళగిరి కరుణానిధి జీవించి ఉన్పప్పుడే పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. కరుణానిధి మరణం తర్వాత ఆళగిరి తిరిగి డీఎంకేలో వచ్చేందుకు ప్రయత్నించారు. చెన్నైలో భారీ ర్యాలీని నిర్వహించారు. తన తండ్రి స్థాపించిన డీఎంకేపై తనకూ అధికారం ఉందని ఆళగిరి చెప్పారు. అయితే అప్పటికే డీఎంకేను స్వాధీనం చేసుకున్న స్టాలిన్ ఆళగిరి రాకను వ్యతిరేకించారు. కుటుంబ సభ్యుల చేత ఆళగిరి స్టాలిన్ పై వత్తిడి తెచ్చినా ఆయన అంగీకరించలేదు.మధురై ప్రాంతంలో గట్టి పట్టున్న ఆళగిరి డీఎంకేలో చేరేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో మిగిలిన పార్టీల కన్ను ఆళగిరిపై పడింది. గత ఏడాది కాలం నుంచి ఆళగిరి మౌనంగానే ఉంటున్నారు. ఆయన కోసం ఇప్పటికే దాదాపు అన్ని పార్టీలూ ప్రయత్నాలు చేశాయి. ఆళగిరి కోసం భారతీయ జనతా పార్టీ కూడా ప్రయత్నించింది. ఒకదశలో ఆళగిరి బీజేపీలో చేరతారన్న ప్రచారం జరిగింది. అయితే ఆళగిరి మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.తమిళనాడులో పార్లమెంటు ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగినా ఆళగిరి జాడ కన్పించలేదు. అయితే తాజాగా మరోసారి ఆళగిరి యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది. తాను డీఎంకేలో లేనని ఆళగిరి ప్రకటించారు. దీన్ని బట్టి ఆళగిరి త్వరలోనే కొత్త పార్టీలోచేరతారన్న ప్రచారం తమిళనాడులో ఊపందుకుంది. ఆళగిరి రజనీకాంత్ పెట్టబోయే కొత్త పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. రజనీ, ఆళగిరి ఫ్లెక్సీ మధురై ప్రాంతంలో వెలుస్తుండటం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. శాసనసభ ఎన్నికల్లో సోదరుడిని దెబ్బతీయాలన్నదే ఆళగిరి లక్ష్యంగా కన్పిస్తుంది.

 

కనిగిరిలో కరువైన మానవత్వం

 

Tags:Prepare for the re-entry of Alagiri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *