జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేయండి

Prepare future plans for the district's development

Prepare future plans for the district's development

-పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు సంబంధిత శాఖలు సమన్వయం తో పని చేయండి

– రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ శాఖామాత్యులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి

Date:19/10/2019

సదుం ముచ్చట్లు:

జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. శనివారం సదుంలోని సి ఎల్ ఆర్ సి సమావేశపు మందిరంలో జిల్లా మరియు డివిజన్ స్థాయి అధికారులతో జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలు పై సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో చిత్తూరు ఎంపి రెడ్డెప్ప,పలమనేరు, తంబళ్ళపల్లె శాసన సభ్యులు వెంకటే గౌడ్, ద్వారకనాథ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా, మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి, ట్రైనీ కలెక్టర్ పృథ్వీ తేజ్, జెసి 2 చంద్రమౌళిలు పాల్గొన్నారు.

 

 

ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా అమలవుతున్న పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసి లబ్ధి చేకూరేలా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాను మరింత అభివృద్ధి దిశలోకి తీసుకుని వెళ్ళేందుకు అవసరమైన భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేయాలని తెలిపారు. ఈ సమీక్షలో భాగంగా తొలుత జిల్లా నీటి యాజమాన్య సంస్థ ( డ్వామా) పై సమీక్షిస్తూ జిల్లాలో 150 లక్షల పని దినాలు కల్పించడమే లక్ష్యం కాగా ఇప్పటి వరకు 70 లక్షల పని దినాలను కల్పించడం జరిగిందని, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక శ్మశాన వాటిక ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో 27,735 ఫారం పాండ్స్ మంజూరు కాగా అందులో 4,542 ఫారం పాండ్లను పూర్తి చేయడం జరిగిందని, హార్టికల్చర్ ప్లాంటేషన్లో భాగంగా 645 జిపి లలో 3,279.18 ఎకరాలలో పిట్టింగ్ ను మరియు 1132.38 ఎకరాలలో ప్లాంటేషన్ చేయడం జరుగుతున్నదని, శ్మశాన వాటికలకు సంబంధించి 453 మంజూరు చేయగా 284 పురోగతిలో ఉన్నవని 10 పూర్తి కావడం జరిగిందని తెలిపారు.

 

 

 

 

 

విలేజ్ పార్కులను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, జిల్లా వ్యాప్తంగా 75 పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వగా 39 పనులు పురోగతిలో ఉన్నవని, నీటి సంరక్షణా చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 699 బోర్ వెల్స్ ను రీఛార్జి చేసేందుకు, 1,376 రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ను, 5,432బౌండరీస్ ట్రెంచెస్ కొరకు మంజూరు చేయడం జరిగిందని మరియు పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాలలో 2,313 ఫారం పాండ్స్ మంజూరు చేయగా అందులో 1306 పురోగతి లో ఉండగా 318 పూర్తి కావడం జరిగిందని, హార్టి కల్చర్ ప్లాంటేషన్ లో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం 77 జిపి లలో 792.59 ఎకరాలలో పనులు మంజూరు చేయడం జరిగిందని, 548.07 ఎకరాలలో పిట్టింగ్ చేయడం జరుగుచున్నదని, 320.06 ఎకరాలలో ప్లాంటేషన్ చేయడం జరుగుతున్నదని, శ్మశాన వాటికలకు సంబంధించి 26 పనులు మంజూరు కాగా, 17 పనులు పురోగతిలో ఉన్నవని, విలేజ్ పార్కులకు సంబంధించి పుంగనూరులో 3, రొంపిచెర్లలో 1 పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగిందని డ్వామా పిడి చంద్రశేఖర్ మంత్రికి వివరించగా ఎన్ఆర్ఈజిఎస్ పథకం కింద ఉపాధి కూలీలకు క్షేత్ర స్థాయిలో పని దినాలను కల్పించాలని ఆదేశించారు.

 

 

 

 

పంచాయతీరాజ్ శాఖ సమీక్షలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో రోడ్లు లేని గ్రామాలు లేకుండా అన్ని గ్రామాలకు రోడ్లు ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్ ఎస్.ఈ అమరనాథ రెడ్డి ని ఆదేశిస్తూ గ్రామ సచివాలయాల ఏర్పాటుకు పంచాయతీ భవనాలు కాని, ఇతర ప్రభుత్వ భవనాలు కానీ అందుబాటులో లేనట్లైతే కొత్త భవనాల నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్ డబ్ల్యుఎస్ శాఖ సమీక్షలో భాగంగా జిల్లాలో త్రాగునీటి సమస్య లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, వాటర్ గ్రిడ్ పనులకు సంబంధించి డిపిఆర్ ని సిద్ధం చేయడం జరిగిందని ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ వేణు మంత్రికి వివరించారు. హౌసింగ్ శాఖ సమీక్షలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉగాది నాటికి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ సంబంధించి హౌసింగ్ మరియు రెవెన్యూ శాఖ సమన్వయంతో పని చేయాలని మంత్రి ఆదేశించారు.

 

 

 

గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని డిఆర్డిఏ మరియు మెప్మా పిడి లైన మురళి, జ్యోతిలను ఆదేశించారు. వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీతో అందించే విత్తనాలను రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో సక్రమంగా అందజేయాలని, చిరుదాన్యాల సాగును ప్రోత్సహించే విధంగా రైతుల్లో అవగాహన తీసుకురావాలని, వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు ఆధునిక పద్దతుల్లో సాగుకు సంబంధించి పూర్తి అవగాహన తీసుకుని వచ్చి లాభసాటి వ్యవసాయం జరిగేలా చూడాలని జెడి విజయ్ కుమార్ ను ఆదేశించారు. ఉద్యానవన పంటలు మరియు అన్ని పంటలకు డ్రిప్ పరికరాలను అమర్చుకుని తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడి సాధించే విధంగా రైతులను ప్రోత్సహించాలని ఇందుకు హార్టికల్చర్ మరియు ఏపిఎంఐపి సంయుక్తంగా సమన్వయంతో పనిచేసి రైతులందరూ వంద శాతం డ్రిప్ పరికరాలను అమర్చుకునేలా చర్యలు చేపట్టాలని ఏపిఎంఐపి పిడి విద్యాశంకర్ ను  ఆదేశించారు.

 

 

 

 

జిల్లాలో సిరికల్చర్ పై ఆధారపడిన రైతులకు ప్రభుత్వం ద్వారా అందించే సబ్సిడీతో షెడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని జెడి అరుణ కుమారిని ఆదేశించారు. పశు సంవర్థక శాఖకు సంబంధించి క్షేత్ర స్థాయిలో గల సిబ్బంది అందరూ పశువులు, గొర్రెలు అన్నింటికీ ఇన్షూరెన్స్ చేయించేలా చర్యలు తీసుకోవాలని జెడి వెంకట్రావును ఆదేశించారు. విద్యాశాఖ లో నాడు నేడు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, ఎన్ని స్కూల్ లకు కాంపౌండ్ వాల్స్, కిచెన్ గార్డెన్స్ అవసరమో అందుకు సంబంధించిన ప్రతిపాదనలను నియోజకవర్గం వారీగా ఇవ్వాలని తెలిపారు. ఈ సమీక్షలో భాగంగా ఎస్సీ, ఎస్టి, బిసి, మైనారిటీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల ప్రగతి పై మంత్రి సమీక్షించారు.  ఈ సమీక్షా సమావేశం లో జెడ్పి సిఈఓ కోదండరామి రెడ్డి, సిపిఓ ఆనంద నాయక్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు,డివిజన్ స్థాయి అధికారులు, పుంగనూరు నియోజకవర్గ తహశీల్దార్లు, ఎంపిడిఓ లు పాల్గొన్నారు.

స్వామీజీల పై ఐటీ దాడులకు రెడీ అవుతున్నబీజేపీ సర్కారు

Tags: Prepare future plans for the district’s development

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *