నాణ్యమైన నెయ్యితో శ్రీవారి లడ్డు ప్రసాదాల శాంపిల్స్ తయారు చేయండి

– పోటు కార్మికులతో టీటీడీ ఈవో

 

తిరుమల ముచ్చట్లు:

నాణ్యమైన నెయ్యి, శెనగపిండి, యాలకులు ఉపయోగించి మరింత రుచికరంగా లడ్డూల శాంపిల్స్ తయారు చేసి నాణ్యతను పరిశీలించాలని టీటీడీ ఈవో  జె శ్యామలరావు పోటు కార్మికులను ఆదేశించారు.తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో శుక్రవారం లడ్డూ తయారీపై జేఈవో  వీరబ్రహ్మం, సివిఎస్‌వో నరసింహకిషోర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యతా లోపం పై వస్తున్న విమర్శలకు గల కారణాలను ఈవో పోటు కార్మికులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పోటు కార్మికులు లడ్డూల తయారీలో వినియోగిస్తున్న శెనగపిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంపొందించాలని అభిప్రాయ పడ్డారు.అంతే కాకుండా పని భారం పెరిగిపోవడంతో అదనపు సిబ్బందిని తదనుగుణంగా నియమించాలని వారు ఈఓకు విన్నవించారు.అన్ని ముడి సరుకులను టెండర్ల ద్వారా సేకరిస్తున్నామని, తక్కువ ధరకు తెలిపిన వారి వద్దనుండి కొనుగోలు చేస్తామని సంబంధిత అధికారులు ఈఓకు వివరించారు.అధికారులు, పోటు కార్మికుల సలహాలు, సూచనలు విన్న తరువాత, ఈవో మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన నెయ్యి మరియు ఇతర పదార్థాలను ఉపయోగించి రుచికరమైన లడ్డూల నమూనాలను (శాంపిల్స్)తయారు చేసి రుచి, నాణ్యతను పరిశీలించాలని కోరారు.ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో  లోకనాథం, ఏఈవో (పోటు)  శ్రీనివాసులు, విశ్రాంత ఏఈవోలు  శ్రీనివాసన్,  వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Prepare samples of Srivari Laddu Prasads with quality ghee

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *