కొల్లాపూర్ సంబురాలకు సర్వం సిద్ధం

Prepare to make the best of Kollapur

Prepare to make the best of Kollapur

Date:06/10/2018
అదివారం నుంచి మూడు రోజుల పాటు ఘనంగా సాంస్కృతీ సంరంభం
కొల్లాపూర్ ముచ్చట్లు:
రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ సంబురాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల7 నుండి 9 వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొల్లాపూర్ సంబురాలు అంబరాన్ని అంటనున్నాయి. ఇందుకోసం కొల్లాపూర్లోని రాజావారి బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన జూపల్లి రంగారావు కళావేధిక సిద్దమైంది.
ఈ నెల 7న ఉదయం 8 గంటలకు జఫర్ మైదానం నుండి ప్రారంభమయ్యే కొల్లాపూర్ వైభవ యాత్రతో సంబురాలకు అంకురార్పణ జరుగనుంది. ప్రారంభ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ముఖ్య అథితులుగా పాల్గొననున్నారు.
సంబురాల కోసం దేశపతి శ్రీనివాస్ రాసిన కొల్లాపూర్ వైభవ ప్రత్యేక గీతాన్ని ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు. అలాగే తెలంగాణ సంగీత, నాటక పరిషత్ ఛైర్మన్ బాద్మి శివకుమార్, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి లాంటి వారు తొలి రోజు సంబురాల్లో సందడి చేయనున్నారు.
రెండోరోజు 8వ తేదీన సంబురాలకు ముఖ్య అథితిగా తెలంగాణ శాసన సభాపతి మధుసూదనాచారి, మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావుతో పాటు పార్లమెంట్ సభ్యులు జితేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత సిక్కిరెడ్డి, ప్రముఖ మెజీషియన్ మర్రి రమేశ్లు హాజరవుతారు.
ఈనెల 9వ తేదీన కొల్లాపూర్ సంబరాల ముగింపుతో పాటు… బతుకమ్మసంబరాల ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్లి భరణి హాజరు కానున్నారు. సంబురాల్లో భాగంగా దేశ, విదేశాల్లో ఉన్న దాదాపు 60 మంది కొల్లాపూర్ ఫ్రాంత ప్రముఖులను ఘనంగా సన్మానించనున్నారు.
ఈ సంబరాల్లో భాగంగా ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 వరకు ఈ ప్రాంత కళాకారులతో పాటు…తెలంగాణాలోని ప్రముఖ కళాకారులతో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహించనున్నారు.
సంబరాల ముగింపు రోజు మంగళవారం రాత్రి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, నంది అవార్డ్ గ్రహీత వందేమాతరం శ్రీనివాస్ బృందం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంగీత విభావరి జరుగనుంది.  అలాగే గత పదిహేను రోజులుగా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేయనున్నారు. ఈ సంబరాలను తిలకించేందుకు ప్రతి రోజు పది వేల మంది జనం వస్తారనే అంచనాతో నిర్వహకులు ఏర్పాట్లు చేశారు.
Tags:Prepare to make the best of Kollapur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *