అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మాతగా జీఏ2పిక్చర్స్, కిరణ్ అబ్బవరం కాంబినేషన్ లో వినరో భాగ్యము విష్ణుకథ పూజాకార్యక్రమాలతో ప్రారంభం
హైదరాబాద్ ముచ్చట్లు:
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా యంగ్ హ్యాపెనింగ్ హీరో కిరణ్ అబ్బవరం, యంగ్ హీరోయిన్ కశ్మీర పర్ధేశీ జంటగా ప్రొడక్షన్ 7 జనవరి 7, 2022న ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ముఖ్య అతిధిగా హాజరై చిత్ర ప్రారంభ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అల్లు అన్విత హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ కశ్మీరా పర్ధేశీల పై క్లాప్ తో చిత్రాన్ని ప్రారంభించారు. నిర్మాత బన్నీవాసు కెమెరా స్విఛ్ ఆన్ చేశారు. ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురూ దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. ప్రఖ్యాత దర్శకులు ప్రశాంత్ నీల్, కిషోర్ తిరుమల దగ్గర మురిళి కిషోర్ గతంలో పనిచేశారు.జీఏ2పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, చావు కబురు చల్లగా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ వినూత్నమైన కథతో ఈ నూతన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా నిర్మాత బన్నీవాసు తెలిపారు. ఈ చిత్రానికి వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్ పెట్టినట్లుగా నిర్మాత బన్నీవాసు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు వ్యవహరిస్తున్నారు. సత్యగమిడి, శరత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాతలు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా విడుదల అవ్వనున్నాయి.
హీరో – కిరణ్ అబ్బవరం హీరోయిన్ – కశ్మీర పర్ధేశీ
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Presented by Allu Arvind and produced by Bannivasu, GA2 Pictures, Kiran Abbavaram Combination with Vinaro Bhagyamu Vishnukatha Pooja Programs