ఇనాంభూముల ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం లక్షలాది రైతులకు ఉపశమనం

Date:15/11/2020

అమరావతి ముచ్చట్లు:

ఇనాం భూములు సమాజంలో సేవ చేసిన వారికి, విశిష్ట వ్యక్తులకు దేవాలయాలకు రాజుల కాలంలో ఇవ్వబడని భూములను ఇనాం భూములు అంటారు. ముస్లిం పాలక వ్యవస్థ లో జాగీర్లు గా పిలువబడ్డాయి. ఇనాం భూముల మెజర్ ఇనాం, మైనర్ ఇనాం అని పిలిచేవారు

●ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018లో జారీచేసిన ఇనాం భూముల ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్ ఆమోదముద్ర వేశారు.

●‘‘ది ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్రా ఏరియా) ఇనాం (అబాలిషన్‌ అండ్‌ కన్వర్షన్‌ ఇన్‌టూ రైత్వారీ) (అమెండ్‌మెంట్‌) ఆర్డినెన్స్‌-2018’’

●రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 213 (1) నిబంధనల ప్రకారం రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

●ఫలితంగా 1956 నుంచి 2013 వరకు జరిగిన ఇనాం భూముల కొనుగోళ్లు, అమ్మకాలపై ఉన్న నిషేధం తొలగి లక్షల మందికి ఉపశమనం కలుగనుంది.

●సర్వీస్‌, ఇనాం భూములకు ఫామ్‌-8 కింద రైత్వారీ పట్టా ఇచ్చినా ఆ భూముల కొనుగోళ్లు, అమ్మకాలు చెల్లవంటూ ఇనాం ల్యాండ్‌ అబాలిషన్‌ యాక్ట్‌కు సవరణ చేస్తూ 2013లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16/2013 చట్టం తీసుకొచ్చారు.

●ఆ నిబంధనను 1956 నుంచి జరిగిన లావాదేవీలకూ వర్తింపజేయడంతో (రెట్రాస్పెక్టివ్‌) గతంలో చేతులు మారిన భూములన్నీ సమస్యల్లో పడ్డాయి. అప్పట్లో జరిగిన రిజిస్ట్రేషన్లన్నింటినీ స్తంభింపజేయడంతో చివరలో కొన్నవారు బాధితులుగా మిగిలిపోయారు.

●ఆ ఇబ్బందులను తొలగించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018లో ఆర్డినెన్స్‌ జారీచేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది.

●16/2013లో పెట్టిన షరతు ఆ చట్టం ఆమోదించక ముందు జరిగిన లావాదేవీలకు వర్తించదని, 2013లో చట్టం అమల్లోకి వచ్చాక జరిగిన వాటికే పరిమితం అవుతుందని సవరణ తెస్తూ ఆర్డినెన్స్‌ జారీచేసింది.

●ఇప్పుడు దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో 2013కి ముందు జరిగిన లావాదేవీలపై నిషేధం తొలగిపోనుంది. 2013కి ముందు ఫామ్‌-8 ప్రకారం రైత్వారీ పట్టాలు పొందిన వారికి సదరు భూములపై పూర్తిస్థాయి హక్కులు ఉంటాయి.

మీ గ్రామానికి నిధులు ఎలా వస్తాయో మీకు తెలుసా!

Tags: Presidential approval of Orphans Ordinance relieves millions of farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *