Natyam ad

సైబర్ నేరాలకు అడ్డుకట్ట

కడప ముచ్చట్లు:

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించే సిబ్బంది సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్  పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఇద్దరు చొప్పున కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న పోలీసు సిబ్బందికి సైబర్ నేరాలు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడే వారిని గుర్తించి శిక్షించేందుకు వీలుగా శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్  మాట్లాడుతూ నిత్య విద్యార్థిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే మోసాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.  శిక్షణలో భాగంగా ప్రతి రోజు ఆన్ లైన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించనున్న ఈ శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై సుశిక్షితులైన పోలీసు అధికారులు అందించే శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ప్రస్తుత సమాజంలో ప్రజలు ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్న నేపథ్యంలో సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు.  ఓ.టి.పి నేరాలు, ఆన్ లైన్ మోసాలు, ఓ.టి.పి లేకుండా చేసే మోసాలు, ఉద్యోగాల పేరిట ఎర వేసి ప్రజలను మోసం చేసే వారిని, ఇతర సైబర్ మోసాలకు పాల్పడే నేరగాళ్ళను సాక్ష్యాధారాలతో కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు.

 

 

Post Midle

శిక్షణలో పిటిషన్ మేనేజ్మెంట్, ఎఫ్.ఐ.ఆర్ మేనేజ్మెంట్, స్టేషన్ మేనేజ్మెంట్, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం, క్రిమినల్ ఇంటెలిజెన్స్ సిస్టం తదితర అంశాల్లో మెళకువలు నేర్పిస్తారన్నారు.  స్టేషన్ కు వచ్చిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్.సి.ఆర్.పి) లో ఫిర్యాదును నమోదు చేయాలని సూచించారు. ఆర్ధిక పరమైన సైబర్ మోసాలకు గురయిన వారికి 1930 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయడంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్ ఆదేశించారు. భౌతిక పోలీసింగ్ తో పాటు డిజిటల్ పోలీసింగ్ పై అవగాహన కలిగి ఉండాలని,  సి.సి.టి.ఎన్.ఎస్, ఈ-కాప్స్ పై పట్టు సాధించాల న్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్.పి (అడ్మిన్) నీలం పూజిత, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నాయుడు, సైబర్ క్రైమ్ ఎస్.ఐ లు మధుమల్లేశ్వర రెడ్డి, సుభాష్ చంద్రబోస్, ఐ.టి కోర్ టీమ్ ఇంచార్జ్ ఏ.ఎస్.ఐ అక్బర్ అలీ, సిబ్బంది శ్రీనివాస్ యాదవ్, నాగేశ్వరరావు, గంగాధర్, రమణ, జగదీశ్, సైబర్ క్రైమ్ కానిస్టేబుళ్ళు తాజుద్దీన్, రెడ్డెప్ప, ముబారక్, వెంకటరమణ, వివిధ పోలీస్ స్టేషన్ల కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.

 

Tags: Prevent cyber crime

Post Midle