నీటి వృధాను అరికట్టండి
కడప ముచ్చట్లు:
జలం జీవనాధా రం ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనది నీరు లీకుల ద్వారా వృధాగా పోకుండా, నగర ప్రజల దాహార్తిని అవసరాలను తీర్చేలా చూడాలనిరాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు మడగలం ప్రసాద్ అన్నారు.సోమవారం గ్రీవెన్స్ సెల్ లోకడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చందు తన కార్యాలయం నందు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప మద్రాస్ రోడ్డు రామాంజనేయ పురం లోని, ఆరోగ్యమాత కాన్వెంట్ గేటు ముందర పరిసర ప్రాంతాలలో వాటర్ పైప్ లైన్ లీకేజీ వలన ఆ ప్రాంతమంతా బురదమయంగా మారిందని, మీరు వృధాగా పోవడం వల్ల నగర ప్రజల అవసరాలు సకాలంలో తీరవని ప్రతి నీటి బిందువు ఎంతో విలువైనది అని ఆయన అన్నారు.ఈ సమస్య పై స్పందించిన కమిషనర్ వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామని నీటి లీకేజీలను అరికడతామని ఆయన తెలిపారు.
Tags: Prevent water wastage

