కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకు..

Date:30/03/2020

సిద్ధిపేట,ముచ్చట్లు:

పేట పట్టణ ప్రధాన వీధుల్లో..సోడియం హైపో క్లోరైడ్ మందు నీళ్లలో కలిపి స్ప్రే
పర్యవేక్షించిన మంత్రి హరీశ్ రావు, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజాంబీల్ ఖాన్
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట గాంధీ సర్కిల్ నుంచి లాల్ కమాన్ రోడ్డులో కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకై సోమవారం ఉదయం మంత్రి సూచనల మేరకు జిల్లా అధికారిక యంత్రాంగం సోడియం హైపో క్లోరైడ్ మందును నీళ్లలో కలిపి స్ప్రే చేయించింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట పట్టణంలోని ప్రధాన వీధుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలందరూ సహకరించి అధికారుల నిబంధనలను పాటించి ఇంటి వద్దనే ఉండాలని ఉదయం మాత్రమే అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి నిల్వ‌ ఉంచుకోవాలని ప్రజలను కోరారు. కాగా పట్టణంలోని  గాంధీ సర్కిల్ నుంచి లాల్ కమాన్ వెళ్లే రోడ్డున, విక్టరీ టాకీస్ సర్కిల్ నుంచి భారత్ నగర్, ఏనసాన్ పల్లి రోడ్డు వరకూ సోడియం హైపోక్లోరైట్ మందును నీళ్లలో కలిపి ప్రత్యేక స్ప్రే వాహనం, సిబ్బంది సాయంతో స్ప్రే చేయించారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజాంబీల్ ఖాన్,
మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,  వివిధ శాఖల అధికారులతో కలిసి  పర్యవేక్షించారు.

భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలే ప్రపంచానికి ఆదర్శం

Tags:Prevention of coronavirus infection
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *